ETV Bharat / state

Cricket tournament: ముగిసిన ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్..40 రోజులపాటు కొనసాగిన పోటీలు

author img

By

Published : Jun 7, 2023, 1:54 PM IST

NTR Cricket tournament
NTR Cricket tournament

NTR Cricket tournament: ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తణుకులో ఏప్రిల్ 23వ తేదీన ప్రారంభించిన క్రికెట్ పోటీలు నిన్నటి వరకు కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా 84 టీమ్ లకు చెందిన సుమారు 1200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలు 40 రోజులు పాటు సాగాయి. విజేతలకు 50వేలు, 30వేలు, 15,000వేల చొప్పున నగదు బహుమతి, ట్రోఫీలు అందజేశారు.

NTR Cricket tournament at Tanuku: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన క్రికెట్ పోటీలు ముగిశాయి. మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 40 రోజులపాటు పోటీలు నిర్వహించారు. విజేతలకు పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు రాధాకృష్ణలు బహుమతి ప్రదానం చేశారు. ఎన్టీఆర్ ఆశీసులతోనే క్రీడలు విజయవంతంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

NTR Idols in Tenali: ఎన్టీఆర్​ శత జయంతి ఉత్సవాలు.. తెనాలి టు విదేశాలకు అన్నగారి విగ్రహాలు

పోటీ పడ్డ 1200 మంది క్రీడాకారులు: ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా తణుకులో ఏప్రిల్ 23వ తేదీన క్రికెట్ పోటీలు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 84 టీమ్​లకు చెందిన సుమారు 1200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 40 రోజులు పాటు సాగిన పోటీలలో నరసాపురం మహేష్ టీం విజయం సాధించారు. రెండో స్థానంలో తణుకు మెగా 11 టీం, మూడో స్థానంలో నరసాపురం జూనియర్స్ టీమ్ గెలిచాయి. విజేతలకు 50,000 30,000 15,000 చొప్పున నగదు బహుమతి ట్రోఫీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు, తణుకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణులు అందజేశారు.

NTR in Politics: గల్లీ నుంచి దిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన రాజకీయ యోధుడు.. సమాఖ్య వ్యవస్థ కోసం పోరాడిన ధీరుడు

యువతలో స్ఫూర్తిని నింపడానికి పోటీలు: నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత ఎన్టీ రామారావుకు దక్కుతుందని చెప్పారు. సంక్షేమాన్ని రాష్ట్రంలోనే గాక దేశానికి పరిచయం చేసిన మహావ్యక్తి ఎన్టీరామారావు అని కొనియాడారు. ఆయన శతజయంతి సందర్భంగా క్రికెట్ పోటీలను నిర్వహించడం అభినందనీయం అన్నారు. తణుకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ శతజయంతిని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంగా తణుకులో క్రికెట్ పోటీలను నిర్వహించడానికి రూపకల్పన చేశామన్నారు. ఎన్టీఆర్ పేరు చెప్తేనే ప్రోత్సాహం స్ఫూర్తి అని అటువంటి స్ఫూర్తిని యువతలో నింపడానికి పోటీలు నిర్వహించామని వివరించారు.

'ఎన్టీఆర్ సంక్షేమ కార్యక్రమాల వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకోని ఆయన పేరు మీద టోర్నమెంట్లు నిర్వహించాం. ఈ టోర్నమెంట్ లో మెుత్తం 84 టీంలు పాల్గొన్నాయి. 84 టీమ్ లకు చెందిన సుమారు 1200 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. 40 రోజులు పాటు సాగిన పోటీలలో నరసాపురం మహేష్ టీం విజయం సాధించారు. రెండో స్థానంలో తణుకు మెగా 11 టీం, మూడో స్థానంలో నరసాపురం జూనియర్స్ టీమ్ గెలిచాయి. క్రీడా కారులు, స్థానికులు... అందరి సమన్వయంతో క్రీడలను విజయవంతంగా నిర్వహించాం. ఎన్టీఆర్ ఆశిసులతో టోర్నమెంట్ విజయ వంతంగా నిర్వహించాం'-. ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు మాజీ శాసన సభ్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.