ETV Bharat / state

నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం.. వైకాాపాలో భగ్గుమన్న విభేదాలు

author img

By

Published : Jul 30, 2021, 6:27 PM IST

narsapuram municipal meeting
narsapuram municipal meeting

నరసాపురంలో రెండో ఛైర్మన్, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వైకాపాలో విబేధాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఓ సభ్యుడి పేరు ప్రతిపాదించగా.. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మరో సభ్యుడి పేరు ప్రతిపాదించారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. కో ఆప్షన్ సభ్యుడి ఎన్నికలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మున్సిపల్ రెండో చైర్మన్ ఎన్నిక సజావుగా సాగగా కో అప్షన్ సభ్యుడి ఎన్నికలో ఇద్దరికీ విబేధాలు వచ్చాయి. ఎమ్మెల్యే వర్గీయులు ఏడిదకోట సత్యనారాయణ పేరును కో ఆప్షన్ సభ్యుడిగా ప్రతిపాదించగా.. కొత్తపల్లి వర్గీయులు మాజీ కౌన్సిలర్ బళ్ల వెంకటేశ్వరరావు పేరును ప్రతిపాదించారు. దీంతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే ముదునూరి ప్రసదరాజు పార్టీ అధీష్ఠానంతో గంట సేపు చర్చలు జరిపారు. చర్చలు కొలిక్కి రాకపోవడంతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని చైర్ పర్సన్ బర్రె వెంకట రమణ వాయిదా వేశారు. కౌన్సిల్ సభ్యులు అందరూ సమావేశంలో ఉండగా ఓటింగ్ పెట్టకుండా వాయిదా వేయడం ఏమిటని ప్రతిపక్ష సభ్యులు మండిపడ్డారు.

ఈ వ్యవహారాన్ని చూసిన వారంతా గత కొంత కాలంగా.. ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు , మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మధ్య విభేదాలు బయటపడ్డాయనుకుంటున్నారు. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఎటు దారి తీస్తాయోనని చర్చించుకుంటున్నారు.

ఇదీ చదవండి: గ్రామ కార్యదర్శులపై వైకాపా నేతల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.