ETV Bharat / state

POLAVARAM: పోలవరంలో 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులు ప్రారంభం

author img

By

Published : Aug 6, 2021, 9:49 PM IST

పోలవరం ప్రాజెక్టులో 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులు ప్రారంభమయ్యాయి. విద్యుత్ ఉత్పత్తిలో కీలకమైన టర్బైన్లను నిర్మించేందుకు అవసరమైన టన్నెళ్ల తవ్వకం పనుల్ని మెగా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టింది.

hydropower station works start
జలవిద్యుత్ కేంద్రం పనులు ప్రారంభం

పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులు ప్రారంభమయ్యాయి. విద్యుత్ ఉత్పత్తిలో కీలకమైన టర్బైన్లను ఉంచేందుకు 12 ప్రిజర్వ్ టన్నెళ్ల తవ్వకం పనుల్ని మెగా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టింది. 960 మెగావాట్ల సామర్ధ్యంతో ప్రాజెక్టులో జలవిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ వర్టికల్ టర్బైన్లను వినియోగించనున్నారు. భారత్ హెవీ ఎలక్ట్రికల్ సంస్థ తయారు చేసిన ఈ టర్బైన్లను ఉంచేందుకు ప్రిజర్ టన్నెళ్లను తవ్వాల్సి ఉండటంతో ఆ పనుల్ని మొదలుపెట్టారు.

ఒక్కో సొరంగాన్ని 145 మీటర్లు పొడవు.. 9 మీటర్ల వ్యాసంతో తవ్వాలని ప్లాన్​ చేశారు. ప్రతి టర్బైన్​కు ఒకటి చొప్పున 12 జనరేటర్ ట్రాన్స్​ఫార్మర్లను వంద మెగావాట్ల సామర్ద్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఇక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులో భాగంగా 206 మీటర్ల పొడవున అప్రోచ్ ఛానల్, 294 మీటర్ల వెడల్పుతో తవ్వకం పనులు చేపట్టాల్సి ఉంది.

ఇదీ చదవండి...

tdp pulichintala tour: 'జలయజ్ఞంలో ధనయజ్ఞం వల్లే పులిచింతల గేటు కొట్టుకుపోయింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.