ETV Bharat / state

ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు మంజూరు

author img

By

Published : Jun 9, 2020, 7:34 PM IST

మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి.. సర్కారు శ్రీకారం చుట్టింది. కొన్ని ఆసుపత్రులకు ఇప్పటికే నాబార్డు నిధులు మంజూరు కాగా, మిగిలిన వాటిని నాడు నేడు కార్యక్రమం కింద అభివృద్ధి చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు.

Funding for development
ఆసుపత్రుల్లో కొత్త హంగులకు నిధులు మంజూరు

పశ్చిమ గోదావరి జిల్లాలో 15 ఆస్పత్రులను ఆధునిక హంగులతో తీర్చిదిద్దడంతో పాటు అన్ని రకాల వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా 204.92 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. డిజిటల్ ఎక్స్​రే పరికరాలు, శిశువుల కోసం వార్నర్ ఫొటోథెరపీ స్కానింగ్, ఆత్మ మాలిక్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్ పరికరాలు సమకూరుస్తున్నరు. వాటిని సద్వినియోగం చేయడానికి సిబ్బందిని నియమించనున్నారు.

ఆసుపత్రులకు మంజూరైన నిధుల వివరాలు

జిల్లాలో ఆసుపత్రుల అభివృద్ధికి విడుదలైన నిధులు పరిశీలిస్తే చింతలపూడి 25 కోట్లు, భీమవరం 10.16 కోట్లు, పాలకొల్లు 11.6 కోట్లు, కొవ్వూరు 5.5 కోట్లు, తణుకు 35 లక్షలు, జంగారెడ్డిగూడెం 9.19 కోట్లు, తాడేపల్లిగూడెం 11. 22 కోట్లు, నరసాపురం 11.6 కోట్లు, పోలవరం 5. 16 కోట్లు, నిడదవోలు 6. 78 కోట్లు, దెందులూరు 2. 78 కోట్లు, భీమడోలు 2. 30 కోట్లు, ఆకివీడు 1.99 కోట్లు, ఆచంట 82 లక్షలు, పెనుగొండ రెండు కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సూచనల మేరకు నిధులను సద్వినియోగం చేసి ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇవీ చూడండి:

మాస్కులు ధరించకపోతే ఏం చేస్తారో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.