ETV Bharat / state

వరద ప్రవాహంలో కోనసీమ.. ఇబ్బందుల్లో ప్రజలు

author img

By

Published : Sep 9, 2021, 11:22 AM IST

రాష్ట్రంలో వర్షాలు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్​ నుంచి ఆరు లక్షల 37 వేల క్యూసెక్కులు సముద్రంలో వదులుతున్నారు. ఈ క్రమంలో పాయల వద్ద గ్రామాలు వరద నీటిలో మునిగాయి.

వరద ప్రవాహంలో కోనసీమ.. ఇబ్బందుల్లో ప్రజలు
వరద ప్రవాహంలో కోనసీమ.. ఇబ్బందుల్లో ప్రజలు

ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఇవాళ ఉదయం 9 గంటలకు ఆరు లక్షల 37,000 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. ఈ నీరంతా కోనసీమలోని గౌతమి, వశిష్ట, వైనతేయ, గోదావరి నది పాయల ద్వారా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. నదీ పాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. చాకలి పాలెం సమీపంలోని వశిష్ట గోదావరి అనుబంధ పాయలోకి వరద నీరు పోటెత్తడంతో అక్కడ కాజ్​వే ముంపు బారిన పడింది. కనకాయలంక గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చదవండి: floods in agency : వరద సుడిలో మన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.