ETV Bharat / state

'నోటీసులు పంపిస్తే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు'

author img

By

Published : May 25, 2020, 8:38 AM IST

రాజమహేంద్రవరం వైకాపా ఎంపీ మార్గాని భరత్​ను విమర్శిస్తూ.. సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారన్న కారణంతో ఏలూరుకు చెందిన ఉండవల్లి అనూషకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం.... ప్రశ్నించే వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తోందని.. నోటీసులు పంపిస్తే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అనూష స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో పోరాడుతామంటున్న అనూషతో మా ప్రతినిధి రాయుడు ముఖాముఖి ..

etv bharat interview with undavalli anusha in eluru
ఉండవల్లి అనుషతో ఈటీవీభారత్ ముఖాముఖి

ఉండవల్లి అనుషతో ఈటీవీభారత్ ముఖాముఖి

ప్రశ్న: ఈ నోటీసులు ఎందుకు జారీ చేశారు?

జవాబు: మే 1న ఓ వార్తపత్రికలో 'సొమ్ము ఒకటిది సోకు మరొకరిది' అని .. ఓ ఏన్జీసీ నిధులను.. తన సొంత నిధుల్లా కరోనా కోసం పంచిపెట్టారు... అని రాశారు. ఆ కథనాన్ని నేను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాను. దీని ఆధారంగా తూర్పు గోదావరిజిల్లా బొమ్మూరు పోలీస్టేషన్​లో సెక్షన్ 41 కింద నాపై కేసునమోదు చేశారు. మూడు రోజుల్లో స్టేషన్​కు రావాలని పోలీసులు చెప్పారు.

ప్రశ్న: ఈ వార్త ఇది వరకే.. వార్తపత్రికలో వచ్చింది. దీనిని పోస్ట్ చేసినందుకే.. కేసు నమోదైందా..?

జవాబు: తెదేపా నాయకుల గొంతు నొక్కడానికి వైకాపా వాళ్లు ఇలా చేస్తున్నారు. ఈ లాంటి కేసులను చూస్తే నవ్వొస్తుంది. మరెవరూ నిజాలు మాట్లాడకుండా ఉండటానికి ..ఇలా చేస్తున్నారు.

ప్రశ్న: పోలీసులు అందించిన నోటీసుల్లలో ఏం ఉంది?

జవాబు: ఐటీ యాక్ట్ 61 కింద .. రూమర్స్ పెట్టడం, సెక్షన్ 505 రెండు వర్గాల మధ్య విద్వేషాలు పెంచడం కింద పెట్టారు. అట్లాయితే నా మీదా కాదు .. కేసును ఏ వార్త పత్రిక ప్రచురించిందో ఆ సంస్థ పై మొదటగా పెట్టాలి.

ప్రశ్న: ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కేసు నమోదు చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం..?

జవాబు: ఎల్జీ పాలిమర్స్​పై జాతీయ మీడియా ఇచ్చిన.. కథనాలను తెలుగులో రఘునాథ్ మల్లాది తర్జుమా చేసి రాసినా కథనాలను కాపీ .. చేసి సామాజిక మాధ్యమాల్లో రంగనాయకమ్మ షేర్ చేశారు. ఆమెకు నోటీసులు ఇచ్చారు. నెల్లూరులో ఒకరిని అరెస్టు చేశారు. భాను అనే సోషల్​ మీడియా యాక్టివిస్టుని 74 రోజులు రిమాండ్​లో ఉంచారు. 150 ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పరిచినా ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే.. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్​గా ఉండేవాళ్లపై కేసులుపెడితే.. మిగతావారెవరూ నోరెత్తరనుకుంటున్నారు.. ఎక్కడ తొక్కేస్తారో.. అక్కడే పదిమంది తయారవుతారు.

ప్రశ్న: సామాజిక మాధ్యమాల్లో ఇదివరకు కూడా పోస్టులు పెట్టారు. కానీ మీకిప్పుడే నోటిసులు ఎందుకిచ్చారు?

జవాబు: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మ నాపై అనంతపురంలో కేసు నమోదు చేయించారు. ఇది ఆగట్లేదు. 4500మీద కేసు పెడుతాము, అందులో 250 ఆడవాళ్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయినా ఈ పోరాటం ఆపం.. ఇప్పుడు మేము భయపడం. హైకోర్టులో దాకా వెళతాం.

ప్రశ్న: ఎలా పోరాటం చేస్తున్నారు.?

జవాబు: అభ్యంతకర పోస్టులు వాడినప్పుడు మాత్రమే..ఇలా చేయాలి. మా అధినేత చెప్పారు. ఎవరి వ్యక్తిగత విషయాలను జోక్యం చేసుకొవద్దని.. కానీ ప్రశ్నిస్తే..ఇలా చేస్తారంటే..కచ్చితంగా పోరాటం చేస్తాం.

ఇదీచూడండి. కరోనా వైద్య పరీక్షల్లో నెంబర్​ వన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.