ETV Bharat / state

రాష్ట్రం బాగుపడాలంటే సైకో జగన్ పోవాలి: చంద్రబాబు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2024, 11:27 AM IST

Updated : Jan 8, 2024, 1:35 PM IST

Chandrababu Ra Kadali Ra Sabha in Achanta: పేదరికం లేని సమాజ నిర్మాణమే తన జీవిత ఆశయమని రాష్ట్రాన్ని ప్రపంచంతో అనుసంధానం చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అన్నారు. రా కదలిరా కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు నాలుగున్నరేళ్ల వైసీపీ పాలన, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.

chandrababu_sabha
chandrababu_sabha

రాష్ట్రం బాగుపడాలంటే సైకో జగన్ పోవాలి: చంద్రబాబు

Chandrababu Ra Kadali Ra Sabha in Achanta: దొంగ ఓట్లు చేర్చి ఎమ్మెల్యేలను మార్చి ప్రజలను మరోసారి ఏమార్చాలని ముఖ్యమంత్రి జగన్ కలలు కంటున్నారని కానీ ఆయన ఆటలు సాగబోవని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో "రా కదలిరా" సభలో చంద్రబాబు పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలు పూర్తి ఆధిక్యాన్ని ఇచ్చాయని. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు పట్టం కట్టాలని చంద్రబాబు గోదావరి ప్రజానీకానికి పిలుపునిచ్చారు. గత ఎన్నికలలో వేసిన తప్పటడుగును మరోసారి వేయొద్దని విజ్ఞప్తి చేశారు.

పోలవరానికి పట్టిన గ్రహణం వీడాలంటే జగన్​ను ఇంటికి పంపాలి: చంద్రబాబు

బటన్ నొక్కి మాయ మాటలు చెప్పే జగన్ విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు పెంచమని చెబుతూనే ఇవాళ అన్నిటినీ పెంచి మోసం చేశాడని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీని, జగన్​ని వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. రాష్ట్రంలోనే ఆక్వా రంగంలో మొదటి స్థానంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మొత్తం కుదేలైందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఆక్వా రైతుకు రూ1.50కే యూనిట్ విద్యుత్ ఇస్తాం మని హామీ ఇచ్చారు. రైతులు సంతోషంగా లేరనీ రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటం బాధాకరమన్నారు.

హైదరాబాద్‌ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోయింది - సైకో పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి : చంద్రబాబు

తెలుగుదేశం పార్టీతోనే మళ్ళీ రైతు రాజ్యం సాకారమవుతుందని స్పష్టం చేశారు. ప్రతి సభలోనూ విశ్వసనీయత గురించే మాట్లాడే జగన్ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మెడలు వంచుతా అని తన మెడలు ఎందుకు వంచాడో చెప్పాలని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం చేస్తా అని మహిళలకు హామీ ఇచ్చి మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతా అన్న వ్యక్తికి వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని తెలిపారు. జగన్ పాలనలో ఉద్యోగులు అందరూ రోడ్లపై పడ్డారన్న చంద్రబాబు అందుకు అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులే నిదర్శనమన్నారు. పేదలకు, పెత్తందారులకు యుద్ధం అంటూ మాట్లాడే జగన్ దేశంలో ఎక్కువ సంపద ఉన్న ముఖ్యమంత్రిగా ఎందుకు నిలిచాడో చెప్పాలన్నారు.

కనిగిరిలో రెండోరోజు చంద్రబాబు పర్యటన - అన్నా క్యాంటీన్‌ పైలాన్ ఆవిష్కరణ

రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్కరు కూడా సమర్థులైన మంత్రులు లేరు ప్రతిపక్ష నాయకులను తిడితే ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తామనడం హాస్యాస్పదమన్నారు. సూపర్ సిక్స్ పేరిట ప్రకటించిన ప్రతి హామీని అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళతామని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు దోచుకున్నదంతా కక్కించే బాధ్యత తీసుకుంటానని తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం ప్రతి ఒక్కరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోదావరిజిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. తెలుగుదేశం, జనసేన ఇంఛార్జిలు, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, పశ్చిమ గోదావరిజిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి సహా పలువురు సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు సభలో పాల్గొన్నారు.

Last Updated : Jan 8, 2024, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.