ETV Bharat / state

రాష్ట్రంలో రిలయన్స్​ సెలూన్స్​ పెట్టి మా పొట్ట కొట్టొద్దు: నాయీ బ్రాహ్మణులు

author img

By

Published : Nov 22, 2022, 2:21 PM IST

Updated : Nov 22, 2022, 3:02 PM IST

Barbers Protest : రాష్ట్రంలో 5000 వేల కటింగ్​ షాపులు పెడతామని రిలయన్స్​ ప్రకటించడాన్ని నిరసిస్తూ నాయీ బ్రాహ్మణులు నిరసనలు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రిలయన్స్​ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Barbers Protest
Barbers Protest

Barbers Protest At Narasapuram: రిలయన్స్ సంస్థ రాష్ట్రంలో 5 వేల కటింగ్ షాపులు పెడతామని ప్రకటించడాన్ని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్​లో నాయీ బ్రాహ్మణులు ఆందోళన చేపట్టారు. బీఆర్ అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాల వేసి.. రిలయన్స్ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్వం నుంచి క్షౌర వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నామని,.. రిలయన్స్ సంస్థ సెలూన్స్​ పెట్టి తమ పొట్ట కొట్టవద్దని వేడుకున్నారు. సెలూన్స్ పెడితే రాష్ట్రవ్యాప్తంగా రిలయన్స్ వ్యాపారాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 22, 2022, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.