ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన ఉపముఖ్యమంత్రి శ్రీవాణి

author img

By

Published : Feb 15, 2020, 11:52 PM IST

'జగనన్న గోరుముద్ద' పథకంలో భాగంలో ఆహార నాణ్యతను తెలుసుకునేందుకు ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలల్లో పథకం నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.

WICE CM SRIVANI CHEKINGS IN GOVT SCHOOLS
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపముఖ్యమంత్రి శ్రీవాణి ఆకస్మిక తనిఖీలు

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపముఖ్యమంత్రి శ్రీవాణి ఆకస్మిక తనిఖీలు

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పర్యటించారు. 'జగనన్న గోరుముద్ద' పథకంలో భాగంగా కొత్త మెనూ అమలుతీరును పరిశీలించేందుకు ఆమె పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనాన్ని రుచి చూశారు. ఆహార నాణ్యతపట్ల అసంతృప్తి, నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆశయానికి తూట్లు పొడిచే విధానాలను సహించేదిలేదని హెచ్చరించారు. విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని సూచించారు.

ఇదీచదవండి.'అవునా... సీఎం జగన్​కు డాక్టరేట్ వచ్చిందా..?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.