ETV Bharat / state

'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమాన్ని బహిష్కరించిన వాలంటీర్లు - యథావిధిగా సమ్మెబాట

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 4:35 PM IST

Volunteers_Boycott_Adudam_Andhra_Program
Volunteers_Boycott_Adudam_Andhra_Program

Volunteers Boycott Adudam Andhra Program: 'ఆడుదాం ఆంధ్రా' ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాలంటీర్లు బహిష్కరించారు. అరకొర జీతాలు ఇస్తూ పని భారాన్ని మోపారంటూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయ వార్డు వాలంటీర్లు ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెబాట పడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Volunteers Boycott Adudam Andhra Program: డిమాండ్లు నెరవేర్చాలంటూ ఏపీలో గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు ఆందోళన బాట పట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమాన్ని బహిష్కరించి నిరసన చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎంజీఎం పాఠశాల క్రీడా మైదానం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. సచివాలయానికి సంబంధించిన పనులతో పాటు ఇతర పనులు కూడా చేయిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Volunteers Staged Protest Across State: అరకొర జీతాలు ఇస్తూ పని భారాన్ని మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లకు కనీస వేతనం 18 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్​కు వినతిపత్రం అందించారు.

సీఎం జగన్​పై యుద్ధం ప్రకటించిన సొంత సైన్యం-'ఆడుదాం ఆంధ్రా'ను బహిష్కరించాలని నిర్ణయం

Volunteers Protest: విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో 56 మంది వాలంటీర్లు ఎంపీడీవో అప్పలనాయుడుకు సమ్మె నోటీసు అందించారు. 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమానికి ఎమ్మెల్యే రావడంతో అందరూ ఉత్సాహంగా కార్యక్రమం జరిపేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతలో అక్కడే ఉన్న వాలంటీర్లు నేరుగా ఎంపీడీవో అప్పలనాయుడు వద్దకు వెళ్లి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నెలకు ఇస్తున్న వేతనం 18 వేల రూపాయలకు పెంచాలంటూ డిమాండ్ చేశారు. నేటి నుంచి తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంతవరకు విధుల్లోకి వెళ్లబోమంటూ వారంతా అక్కడి నుంచి వెనిదిరిగారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే సైతం ఏమీ చేయలేక మౌనమయ్యారు.

సర్పంచులకు పోటీగా వాలంటీర్లు - వైసీపీ ప్రభుత్వానికి ఎందుకీ కక్ష

AP Village Volunteers Strike: తమ డిమాండ్లు పరిష్కరించాలని కర్నూలు జిల్లా హొళగుంద మండలంలో వాలంటీర్లు నిరసన చేపట్టారు. వాలంటీర్లను తమ సొంత సైన్యంగా భావించే వాలంటీర్లు ఆయన చెప్పినవన్నీ తీపి మాటలేనని, గౌరవ వేతనం పెంచే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు. తమకు ఇస్తున్న గౌరవ వేతనం పెంచాలని, సర్వీసులు క్రమబద్ధీకరించాలని తాసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. పొరుగు సేవల సిబ్బంది, కాంట్రాక్టు కార్మికులకు ఇస్తున్న సాటివేతనం కూడా తమకు ఇవ్వడం లేదని వాలంటీర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెబాట పడతామని హెచ్చరించారు.

Volunteers Protest in AP: గౌరవ వేతనం పెంచడం లేదని, సర్వీసులు క్రమబద్ధీకరించడం లేదని ఇన్నాళ్లూ గ్రామ వాలంటీర్లలో గూడుకట్టుకున్న అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. దీంతో ఈరోజు నుంచి పలు జిల్లాల్లో వాలంటీర్లు సమ్మె బాటు పట్టారు. వాలంటీర్లను సమ్మె నుంచి వైదొలగేలా చేయాలని అధికారులు తీవ్రంగా యత్నించినా ఫలితం లేకపోయింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈరోజు నుంచి యథావిధిగా నిరసనలు చేపట్టారు.

Kanigiri Volunteers Online App Scam: యాప్​ పేరుతో మోసం.. లబోదిబోమంటున్న పింఛన్​ లబ్ధిదారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.