ETV Bharat / state

Lorry overturned: వ్యాన్​ బోల్తా... 27 పశువులు మృతి... ఎక్కడంటే..?

author img

By

Published : Oct 3, 2022, 1:35 PM IST

Updated : Oct 3, 2022, 2:20 PM IST

Lorry overturned: విజయనగరం జిల్లాలో అక్రమంగా పశువుల్ని తరలిస్తున్న వ్యాన్​​ బోల్తాపడడంతో 27 మూగజీవాలు మృతి చెందాయి. మరికొన్ని పశువులు తీవ్రంగా గాయపడ్డాయి. అతివేగంగా వ్యాన్​ నడపడంతో అదుపుతప్పి బోల్తా పడనట్లు తెలుస్తోంది.

Lorry overturned
లారీ బోల్తా

Lorry overturned: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గొర్ల సీతారాంపురం వద్ద అక్రమంగా పశువులను తరలిస్తున్న వ్యాన్​ బోల్తా పడింది. ఈ ఘటనలో 27 పశువులు మృతి చెందాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. పార్వతీపురం జిల్లా గుమడ నుంచి తెలంగాణలోని హైదరాబాద్​కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అతివేగంగా వ్యాన్​ నడపడంతో అర్ధరాతి సమయంలో అదుపుతప్పి బోల్తా పడిందని తెలిపారు. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా వ్యాన్​లో కిక్కిరిసి ఆవులను తరలించడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మృతి చెందిన ఆవులను పూడ్చివేయించారు. గాయపడినవాటిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 3, 2022, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.