ETV Bharat / state

కష్టపడమన్నందుకు కన్నతండ్రినే కడతేర్చిన కుమారుడు

author img

By

Published : May 12, 2020, 11:45 PM IST

వ్యసనాలకు బానిసైన కుమారుడుని కష్టపడి పని చేసుకోమని చెప్పటమే ఆ తండ్రి చేసిన తప్పు. మంచి రుచించని ఆ కొడుకు అమ్మలేని లోటు లేకుండా పెంచుతున్న తండ్రిని సైతం కిరాతకంగా చంపేశాడు. ఈ విషాదకర సంఘటన విజయనగరం జిల్లా పార్వతిపురంలో జరిగింది.

father killed by son in parvathipuram
తండ్రిని చంపిని తనయుడు

కష్టపడి పని చేసుకోమని చెప్పిన కన్నతండ్రినే కిరాతకంగా కడతేర్చాడో కుమారుడు. ఈ విషాదకర సంఘటన విజయనగరం జిల్లా పార్వతిపురం పట్టణం ఇందిరా కాలనీలో జరిగింది.

భార్య చనిపోయినా పిల్లలకు తల్లి లేని లేటు లేకుండా చూసుకునే వాడు రాయుపల్లి ఎండయ్య. కూరగాయలు, పండ్ల వ్యాపారం చేస్తూ ముగ్గురు పిల్లల్ని పోషించుకునేవాడు. మూడేళ్ల క్రితం భార్య చనిపోయినా మరో పెళ్లి చేసుకోలేదు. ఎండయ్య కుమారుడు ఏడో తరగతి వరకు చదివి విద్యకు ఫుల్​స్టాప్ పెట్టేశాడు. అప్పట్నుంచి అల్లరిచిల్లరిగా తిరుగుతూ వ్యవసనాలకు బానిసయ్యాడు. తండ్రిని డబ్బును అడుగుతూ తరచూ ఇబ్బంది పెట్టేవాడు. ఈ క్రమంలోనే తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణలో ఎండయ్యను కళ్యాణ్​ కొట్టటంతో కింద పడిపోయాడు. కింద పడిన ఎండయ్యను తండ్రి అని చూడకుండా పెద్ద రాయితో తలపై మోదాడు. దీంతో ఎండయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న కళ్యాణ్​ కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: చుట్టుముట్టిన కష్టాలు.. మామిడి రైతు కన్నీళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.