PROTEST: నష్టపరిహారం కోసం భూనిర్వాసితుల ఆందోళన.. పోలీసుల అరెస్ట్​

author img

By

Published : Oct 12, 2021, 10:56 PM IST

Concern of Engineering College Landlords for Compensation

విజయనగరం జిల్లాలోని గిరిజన ఇంజినీరింగ్ కళాశాల నిర్వాసితులు, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఏళ్లుగా భూములనే నమ్ముకొని బతుకుతున్న గిరిజనులకు నష్టపరిహారం లేదా భూమి ఇవ్వాలని డిమాండ్ చేసూ.. కురుపాంలోని బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన(protest for compensation) చేపట్టారు.

విజయనగరం జిల్లా కురుపాం మండంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాలకు సేకరిస్తున్న భూమిని సాగు చేస్తున్న గిరిజనులకు ఎకరానికి రూ. 20 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్(demand for compensation)​ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిర్వాసితులు, ప్రజా సంఘాల నాయకులు నిరసన(protest for compensation at Vizianagaram district) చేపట్టారు. గిరిజన శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి ఇంటి ముందు గిరిజనులకు అన్యాయం జరుగుతుందని నాయకులు వాపోయారు.

గిరిజన ఇంజినీరింగ్​ కాలేజ్ రావడాన్ని ఆహ్వానిస్తున్నామని.. అదే క్రమంలో గత 50 ఏళ్లుగా ఆ భూమినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న మాకు భూమి, లేదా నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. ఈ మేరకు గత ఏడాదిగా ఆందోళన చేస్తున్నా.. గిరిజన శాఖ మంత్రి స్పందించకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా మంత్రి స్పందించి బాధితులను ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సాయంపై ఉన్నతాధికారులతో హామీ ఇప్పించాలని డిమాండ్ చేశారు. నిరసన చేస్తున్న 18 గిరిజన మహిళలు, 15 గిరిజన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయం కోసం ఆందోళనలు చేస్తున్న వాళ్లను అక్రమంగా అరెస్టు చేయడానికి పలువురు ప్రజాసంఘాల నాయకులు ఖండించారు. అరెస్టు చేసిన వాళ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి..

Durga Temple: ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.