ETV Bharat / state

గిరిజన ప్రాంతాల్లో లేని రోడ్లు.. నిత్యం గర్భిణులకు తిప్పలు

author img

By

Published : Jan 5, 2020, 9:34 PM IST

pregnant women faces lot of problems at vizianagaram
విజయనగరం జిల్లాలో గర్భిణుల అవస్థలు

ఆసుపత్రికి 20కిలోమీటర్ల దూరం, వెళ్లడానికి రహదారి సౌకర్యం లేదు... ఈ పరిస్థితుల్లో గర్భిణీ ప్రసవ వేదన పడుతుంటే ఆ బాధ వర్ణణాతీతం. విజయనగరం జిల్లాలోని పల్లపుదుంగాడ గిరిజన గ్రామానికి చెందిన ఓ మహిళ పురిటి నొప్పులతో తీవ్ర అవస్థలు పడింది. కుటుంబసభ్యులు డోలీతో ఆసుపత్రికి తరలించారు.

విజయనగరం జిల్లాలో గర్భిణుల అవస్థలు

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పల్లపుదుంగాడ గిరిజన గ్రామంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గర్బిణులకు అవస్థలు తప్పటం లేదు. గ్రామానికి చెందిన సుమిత్ర అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా... భర్త సన్యాసిరావు, బంధువులు కలసి డోలీతో 12కిలోమీటర్ల దూరం మోసుకుంటూ దబ్బగుంట వరకు వచ్చారు. అక్కడి నుంచి ఫీడర్ అంబులెన్స్ ద్వారా ఎస్. కోట సామాజిక ఆసుపత్రికి తరలించారు. రహదారి లేకపోవడం వల్లే గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారని సన్యాసిరావు వాపోతున్నారు.

ఇదీ చదవండి: గర్భిణికి నొప్పులు... డోలీలో తీసుకెళ్తుండగానే ప్రసవం

Intro:ఆసుపత్రికి 20కిలోమీటర్ల దూరం, వెళ్లడానికి రహదారి సౌకర్యం లేదు ఈ పరిస్థితుల్లో గర్భిణీ ప్రసవ వేదన పడుతుంటే ఆ బాధ వర్ణణాతీతం.విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం దారపర్తి పంచాయతీ పల్లపుదుంగాడ గిరిజన గ్రామంలో జన్ని సుమిత్ర కు నెలలు నిండి ఆదివారం ఉదయం నొప్పులు ఎక్కువగా రావడంతో తీవ్ర ఇబ్బందులు పడింది. Body:రోడ్డు సౌకర్యం లేకపోవడంతో భర్త సన్యాసిరావు, బంధువులు కలసి డోలీతో 12కిలోమీటర్ల దూరం మోసుకుంటూ దబ్బగుంట వరకు వచ్చి ఫీడర్ అంబులెన్స్ ద్వారా ఎస్. కోట సామాజిక ఆసుపత్రికి తరలించారు Conclusion:రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇటీవల ముగ్గురు గిరిజన గర్భిణీలు తీవ్ర అవస్థలు పడి ఆసుపత్రికి తీసుకు వచ్చారు. రహదారి లేక పోవడం వల్లే గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారని సుమిత్ర భర సన్యసిరావు వాపోతున్నారు. ఈ అవస్తలకు మోక్షం ఎపుడు లభిస్తుందో వేచి చూడాల్సిందే అంటున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.