విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 20 పూరిళ్లు దగ్ధం

author img

By

Published : Nov 12, 2021, 9:06 PM IST

Updated : Nov 13, 2021, 4:35 AM IST

ire accident in vizianagaram district

04:33 November 13

విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 20 పూరిళ్లు దగ్ధం

21:05 November 12

జక్కువలో భారీ అగ్ని ప్రమాదం..20 పూరిళ్లు దగ్ధం

విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కువ గ్రామంలోని కూరాకుల వీధిలో శుక్రవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది 35వరకు పూరిళ్లు దగ్ధమవ్వగా సుమారు రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు వ్యాపించాయని కొందరు చెబుతుండగా... వెలిగించిన దీపాన్ని ఎలుకలు ఈడ్చుకెళ్లడంతో ప్రమాదం జరిగిందని మరికొందరు అంటున్నారు. ఒకవైపు వర్షం కురుస్తుండగా విద్యుత్తు సరఫరా కూడా నిలిచిపోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో కొందరి ఇళ్లలోని సిలిండర్లు పేలినట్లు చెబుతున్నారు. స్థానికులు మంటలు ఆర్చే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. గజపతినగరం నుంచి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. రేషన్ కార్డులు, పాసు పుస్తకాలు, ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి.

బాధితులంతా కూరగాయల పండిస్తూ జీవనం సాగిస్తుంటారు. గూడు చెదిరి రోడ్డున పడటంతో బాధితులంతా కన్నీరుమున్నీరవుతున్నారు. బాధితులందరికీ స్థానిక పాఠశాలలో వసతి కల్పిస్తున్నట్లు కలెక్టర్ సూర్యకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. తహసీల్దారును వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. నియోజకవర్గ ఎమ్మెల్యే రాజన్న దొర సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అన్ని విధాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

బాధితులకు అన్నిరకాలుగా సాయం చేస్తాం: కలెక్టర్

 మంటలు అదుపులోకి వచ్చినట్లు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తెలిపారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు స్థానిక పాఠశాలలో వసతి కల్పించామన్నారు. అగ్నిప్రమాద బాధితులకు అన్నిరకాలుగా సాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి..

Amaravathi farmer paada yatra: మరింత జోరుగా మహాపాదయాత్ర.. అడుగడుగనా జన నీరాజనం

Last Updated :Nov 13, 2021, 4:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.