ETV Bharat / state

సీఎం ఎవరో తెలీదు.. ఎమ్మెల్యే ఎవరో తెలీదు.. అధికారులపై డిప్యూటీ స్పీకర్ ఆగ్రహం

author img

By

Published : Jan 9, 2023, 7:09 PM IST

Deputy Speaker Kolagatla fire on Officers: దివ్యాంగుల అధికారులపై డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. సీఎం ఎవరో తెలీదు.. ఎమ్మెల్యే ఎవరో తెలీదు.. అంటూ దివ్యాంగులపై ఆగ్రహించారు. దివ్యాంగుల అధికారులు ఎవరికి వారే సొంత సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటున్నారని శివాలెత్తారు.

DEPUTY SPEKAR KOLAGATLA
ఎమ్మెల్యే తెలీదు, సీఎం తెలీదు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

Deputy Speaker Kolagatla fire on disabled officers: రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌త మూడేళ్ల‌లో పేద‌ల సంక్షేమం కోసం చేప‌ట్టిన ప‌థ‌కాల గురించి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి దివ్యాంగులకు వివ‌రించారు. విజయనగరంలోని త‌న ఇంటి వద్ద ఈరోజు ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్రమంలో పాల్గొని.. నియోజ‌వ‌ర్గానికి చెందిన ముగ్గురికి రూ.6.45 ల‌క్ష‌ల విలువ గ‌ల‌ సీఎం రిలీఫ్ చెక్కులను అందజేశారు.

అనంతరం విభిన్న ప్ర‌తిభావంతుల శాఖ ఆధ్వ‌ర్యంలో మంజూరు చేసిన రూ.2.76 లక్ష‌ల విలువ గ‌ల మూడు త్రిచ‌క్ర స్కూటీల‌ను విభిన్న ప్ర‌తిభావంతుల‌కు కోలగట్ల న‌గ‌ర మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్ కోల‌గ‌ట్ల శ్రావణి, విభిన్న ప్ర‌తిభావంతుల విభాగం స‌హాయ సంచాల‌కులు జ‌గ‌దీష్‌, స్థానిక‌ ప్ర‌తినిధులతో కలిసి అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌త మూడేళ్ల‌లో పేద‌ల సంక్షేమం కోసం చేప‌ట్టిన ప‌థ‌కాల్లో ఎక్కడ అవకతవకలు జరగకుండా అందరికీ అందుతున్నాయని తెలిపారు. జిల్లాలో సుమారు 70 స్కూటీల‌ను ప్ర‌భుత్వం మంజూరు చేసింద‌ని, అందులో విజ‌య‌న‌గ‌రం నియోజ‌వ‌ర్గానికి చెందిన ముగ్గురికి స్కూటీల‌ను కేటాయించటం హ‌ర్ష‌ణీయ‌మ‌ని పేర్కొన్నారు. అలాగే, అనారోగ్యాల కార‌ణంగా ఇబ్బందిప‌డిన స్థానికుల‌కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక స‌హాయం అందజేసి, మెరుగైన చికిత్స అంద‌జేశామ‌ని గుర్తు చేశారు. అనంతరం కోలగట్ల లబ్ధిదారులను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ వాహనాలు మీకు ఎవరిచ్చారు..? వారు ఎంతకి సమాధానం చెప్పకపోవడంతో దివ్యాంగుల అధికారులపై మండిపడ్డారు.

దివ్యాంగుల అధికారులపై డిప్యూటీ స్పీకర్ ఆగ్రహం

''మీకు స్కూటీల‌ను ఎవరిస్తున్నారో తెలీదు. చివరికి ఎమ్మెల్యే, సీఎం ఎవరో కూడా తెలీదు. అధికారులు సొంత సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటున్నారు''-డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.