గురజాడ విశిష్ట పురస్కారాన్ని.. ఆశీర్వచనంగా స్వీకరిస్తున్న: చాగంటి
Updated on: Dec 1, 2022, 12:30 PM IST

గురజాడ విశిష్ట పురస్కారాన్ని.. ఆశీర్వచనంగా స్వీకరిస్తున్న: చాగంటి
Updated on: Dec 1, 2022, 12:30 PM IST
Chaganti Koteswara Rao: గురజాడ పురస్కారాన్ని ఆ మహానుభావుడి ఆశీర్వచనంగా భావించే తీసుకున్నట్లు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. ఈ పురస్కారం తీసుకునేందుకు తనకు అర్హత లేకపోయినా.. అంతటి మహానుభావుడి ఆశీర్వచనాన్ని కాదనలేకపోయినట్లు ఆయన తెలిపారు. మహాకవి 107 వర్ధంతి పురస్కరించుకొని గురజాడ సాంస్కృతిక సమాఖ్య విజయనగరంలోని జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో చాగంటి దంపతులకు గురజాడ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేసింది.
Chaganti Koteswara Rao: గురజాడ తన రచనలను సిరాతో రాయలేదని, ప్రజల కష్టాలను చూసి ఆ కన్నీళ్లతో రాశారని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. మహాకవి 107 వర్ధంతి పురస్కరించుకొని గురజాడ సాంస్కృతిక సమాఖ్య విజయనగరంలోని జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో చాగంటి దంపతులకు గురజాడ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ విశిష్ట పురస్కరాన్ని.. పురస్కారంగా భావించటం లేదని.. ఆశీర్వచనంగా స్వీకరిస్తున్నట్లు చాగంటి తెలిపారు.
"దీన్ని పురస్కారంగా భావించడం లేదు, ఆశీర్వచనంగా స్వీకరిస్తున్నా. అయితే., గురజాడ వంటి గొప్ప వ్యక్తి ఆశీర్వచనాన్ని తిరస్కరించేంత బలహీనుడిని కాదు. గురజాడ తన రచనలను సిరాతో రాయలేదు, లోకంలోని కష్టాలను చూసి ఆ కన్నీళ్లతో రాశారు. వ్యవహారిక భాషలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఎన్నో కవితలు రాశారు"-చాగంటి కోటేశ్వరరావు, ప్రముఖ ప్రవచన కర్త
గురజాడ విశిష్ట పురస్కారాన్ని తనకు ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ముందుగానే నిర్వాహకులతో మాట్లాడి.. పురస్కారం రద్దుచేసినా ఫర్వాలేదని, ఎవరికిచ్చినా తాను హాజరవుతానని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే., గురజాడ వంటి గొప్ప వ్యక్తి ఆశీర్వచనాన్ని తిరస్కరించేంత బలహీనుడిని కాదన్నారు. తరాలు మారినా ఆయన ప్రజల నాలుకలపై ఉంటారని తెలిపారు. వ్యవహారిక భాషలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఎన్నో కవితలు రాశారని తెలిపారు. గురజాడ ఆశయాలు, ఆలోచనలను భావితరాలకు అందించాలన్నారు.
ఇవీ చదవండి:
