ETV Bharat / state

పార్వతీపురం ఎమ్మెల్యేపై భాజపా నేతల ఫిర్యాదు

author img

By

Published : Nov 23, 2020, 8:32 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావుపై భాజపా నాయకులు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. భాజపా నాయకుడుతో, ఎమ్మెల్యేకి ఫోన్​లో వాగ్వాదం జరిగింది. తనను అసభ్యకర పదజాలంతో దూషించాడని భాజపా నేత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

BJP leaders' complaint against Parvathipuram MLA
పార్వతీపురం ఎమ్మెల్యేపై భాజాపానేతల ఫిర్యాదు

విజయనగరం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావుపై పట్టణ పోలీస్ స్టేషన్​లో భాజపా నాయకులు ఫిర్యాదు చేశారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పి వేణుగోపాలం జయరాజు, జిల్లా అధ్యక్షులు పి తిరుపతిరావు, నాయకులు డి. శ్రీనివాసరావు, పి. భారతి, ఎస్ .నాగేశ్వరరావు ఎస్సై కళాధర్​న్​ను కలిశారు.. ఫిర్యాదులో అంశాలను ఎస్ఐకి వివరించారు.

మున్సిపాలిటీ నాలుగో వార్డు కోనేరు గట్టుపై ఓ దాత ఇచ్చిన స్థలంలో వరసిద్ధి వినాయకుడు, ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటుకు స్థానికులు ఆర్ఎస్ఎస్ సభ్యులు సన్నాహాలు చేశారు. నిర్మాణ పనులను మున్సిపల్ అధికారులు గత కొద్ది రోజులుగా అడ్డుకుంటున్నారు. పత్రికలు వాట్సాప్​లో వచ్చిన ఈ విషయంపై స్పందించి ద్వారపురెడ్డి శ్రీనివాసరావు మండప నిర్మాణ స్థలానికి చేరుకొని స్థానికులతో మాట్లాడారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే జోగారావు శ్రీనివాసరావుల మధ్య ఫోన్​లో వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే అసభ్యంగా మాట్లాడినట్లు..అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నాయకులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి.పడవపై రోజూ 18కిలోమీటర్ల ప్రయాణం- ఎందుకంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.