ETV Bharat / state

అయ్యప్ప మాలధారులకు నిత్యాన్నదానం

author img

By

Published : Dec 4, 2019, 8:15 PM IST

అయ్యప్ప మాలధారులకు నిత్యాన్నదాన కార్యక్రమం చేపడుతుంది ఎస్.కోట పట్టణానికి చెందిన కమిటీ. విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణంలోని శ్రీ దార గంగమ్మ ఆలయం గత మూడేళ్లుగా అయ్యప్ప స్వాములకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తుంది.

ayyappa-bhakthulaku-nitya-annadanam-in-vizainagaram
అయ్యప్ప మాల దారులకు నిత్యాన్నదానం

అయ్యప్ప మాలధారులకు నిత్యాన్నదానం

వేలాది మంది అయ్యప్ప స్వాములకు భవాని, శివ మాలధారులకు మధ్యాహ్నం పూట అన్నదానం చేస్తున్నారు. విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణంలోని అయ్యప్ప భక్తులు గత మూడేళ్లుగా నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మొదట్లో అన్నదానానికి 500 మంది మాత్రమే హాజరు కాగా... ప్రస్తుతం రోజుకు 1500 మంది అయ్యప్ప స్వాములు, ఇతర మాలధారులు హాజరవుతున్నారు. భోజనం ఏర్పాటు చేయడం వల్ల వివిధ పనులపై పట్టణానికి వచ్చే మాలధారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతిరోజు రూ.20 వేల వరకు ఖర్చవుతుందని నిర్వహకులు తెలిపారు.

ఇవీ చూడండి...'ఇబ్బంది పడుతున్నాం... వంతెన నిర్మించండి సార్'

Intro:అయ్యప్ప మాల దారులకు నిత్యాన్నదాన కార్యక్రమం చేపడుతుంది ఎస్.కోట పట్టణానికి చెందిన న అయ్యప్ప అన్నదాన కమిటీ విజయనగరం జిల్లా ఎస్.కోట పట్నంలో శ్రీ దార గంగమ్మ ఆలయం లో గత మూడేళ్లుగా అయ్యప్ప స్వాములకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తుంది


Body:ఎస్.కోట పట్టణంలో కృష్ణం రాజు అనే అయ్యప్ప భక్తులు మధ్యాహ్నం పూట పట్టణానికి పని మీద వచ్చే మాలధారులు పడుతున్న ఇబ్బందులు గమనించి నిత్యాన్నదానం పెడితే బాగుంటుందని ఆలోచన చేశారు ఈ ఆలోచన గురు భవాని సత్యేంద్ర కుమార్ తో చర్చించారు ఈ కార్యక్రమం మనం మనకు దార గంగమ్మ ఆలయ ఆవరణ అనువుగా ఉంటుందని ఆలోచించి ప్రారంభించారు


Conclusion:గత మూడేళ్లుగా నిర్విరామంగా 45 రోజులపాటు వేలాది మంది అయ్యప్ప స్వాములకు భవాని శివ మాల దారులకు మధ్యాహ్నం పూట అన్నదానం చేస్తున్నారు మొదట్లో 500 మంది మాత్రమే హాజరయ్యేవారు ప్రస్తుతం ప్రతిరోజు పదిహేను వందల మంది వరకు అయ్యప్ప స్వాములు ఇతర మాలధారులు హాజరవుతున్నారు ఈ ఈ కార్యక్రమ నిర్వహణకు చందాలు విరాళాలు వసూలు చేయడం లేదు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందించిన వారి వద్ద తీసుకుంటున్నారు ప్రతిరోజు 20 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి ఎస్ కోట మండలం తో పాటు చుట్టుపక్కల ఐదు ఆరు మండలాల నుంచి మాల గారు హాజరై భోజనం చేస్తున్నారు భోజనం ఏర్పాటు చేయడంవల్ల వివిధ పనుల మీద పట్టణానికి వచ్చే మాల దారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని పలువురు మాలధారులు పేర్కొంటున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.