ETV Bharat / state

RAPE ATTEMPT: మైనర్​పై వృద్దుడు అత్యాచారయత్నం..దేహశుద్ధి చేసిన స్థానికులు

author img

By

Published : Oct 1, 2021, 10:31 PM IST

ఓ మైనర్​పై 60ఏళ్ల వృద్దుడు అత్యాచారయత్నానికి(old man rape attempt on minor girl) పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో జరిగింది. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లోవరాజు తెలిపారు.

ape attempt on a 13 years old girl at Vizianagaram
13 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో తప్పిట దేముడు(60) అనే వృద్ధుడు.. ఎదురింట్లో ఉండే 13 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి (old man rape attempt on minor girl) పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు.. వృద్ధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇవాళ మధ్యాహ్నం సమయంలో బాలికను తన ఇంటి లోపలకి(rape attempt on minor girl) తీసుకెళ్లాడు. వెంటనే వెళ్లిన స్థానికులు దేముడుని నిలదీశారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

ఇతని ప్రవర్తనపై కొన్ని రోజులుగా అనుమానంతో.. కాపు కాసినట్లు స్థానికులు చెప్పారు. బాలిక తండ్రి పిర్యాదుతో నిందితుడు తప్పిట దేముడు(old man rape attempt)పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లోవరాజు తెలిపారు.

ఇదీ చదవండి..

చిన్నారిని కొట్టిన తండ్రి..చనిపోయిన కుమార్తెను ఆస్పత్రిలోనే వదిలివెళ్లిన తల్లి..అసలేమైంది..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.