ETV Bharat / state

మన్యంలో తాగునీరుకి కటకట... అశ్వాల సాయంతో కిలోమీటర్ల నడక!

author img

By

Published : Dec 30, 2020, 2:57 PM IST

మంచి నీటి కోసం బిందెలను గుర్రాలపై పెట్టుకొని వెళ్తున్నారు... ఇదేదో ఎడారి ప్రాంతమని అనుకుంటే మీరు పొరబడినట్లే. నిత్యం చల్లగా ఉండే విశాఖ మన్యంలో తాగు నీటి కోసం అవస్థలు పడుతున్నారు! అవును మీరు చదివింది నిజమే. గిరిజనులకు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే.

water struggles in vishaka agency
మన్యంలో తాగునీటి కష్టాలు

విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన అనంతగిరి మండలం పిన్నకోట పంచాయతీ కరకవలస గిరిజనులు.. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుక్కెడు నీళ్ల కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

గ్రామంలో కొందు తెగకు చెందిన 18 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. మంచి నీటి అవసరాలు తీర్చేందుకు ఏర్పాట్లు చేసినా... ఆ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. అప్పటి నుంచి వీరు గొంతు తడుపుకోవాలంటే.. గుర్రాలకు బిందెలు కట్టి కిలో మీటర్ల దూరం ప్రయాణించక తప్పటం లేదు. సరైన మార్గం సైతం లేక కొండలు, గుట్టల ద్వారా ప్రయాణించి... మంచినీటిని తెచ్చుకుంటున్నారు. తమ అవస్థలపై స్పందించి... తాగునీటి కష్టాలు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు.

మన్యంలో తాగునీటి కష్టాలు

ఇదీ చదవండి:

సముద్రంలో వేట.. మత్స్యకారుల మధ్య రింగువలల వివాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.