శుద్ధమైన నీటిని అందించడంపై 'రాజేంద్రుడి' నిత్యశోధన

author img

By

Published : Dec 20, 2020, 6:51 PM IST

vishakapatnam scientist rajendraprasad innovations to save water

ఆయన పేరు రాజేంద్రప్రసాద్‌. వాళ్లింట్లో ఎక్కడ చూసినా నీటి సంరక్షణా పరికరాలు, యంత్రాలే కనిపిస్తాయి. మారుమూల గిరిజనులకు తక్కువ ఖర్చుతో శుద్ధమైన నీటిని ఎలా అందించాలని ఆయన నిత్యం ఆలోచిస్తుంటారు. దాని కోసమే నిరంతరం పరిశధనలు చేస్తుంటారు. ఆయన తయారు చేసిన యంత్రాలు, పరికరాలకు గానూ కేంద్రప్రభుత్వ ప్రశంసలు అందుకున్నారు.

శుద్ధమైన నీటిని అందించడంపై 'రాజేంద్రుడి' నిత్యశోధన

విశాఖకు చెందిన రాజేంద్రప్రసాద్‌ ఫార్మసీ చదువుతున్న సమయంలో నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌లో వాలంటీర్‌గా.. 2008లో అరకు, పాడేరు పరిసరాల్లో పర్యటించారు. గిరిజనులు శుద్ధమైన నీరు తాగకపోవడం వల్ల.. వ్యాధుల బారిన పడుతున్నట్టు గుర్తించారు. అలాంటి వారికి శుద్ధమైన నీటిని అందిచాలనే దిశగా తొలుత బ్లూటోమర్‌ అనే చిన్న శుద్ధి యంత్రాన్ని తయారుచేశారు. ఆ యంత్రం ఎంతటి మురుగు నీటినైనా శుద్ధమైన తాగునీరుగా మార్చేస్తుంది. తర్వాత వర్షపు నీటిని శుద్ధి చేసే యంత్రం.. ఆ తర్వాత సౌరశక్తితో పని చేసే నీటి శుద్ధియంత్రం తయారు చేశారు. ఈ యంత్రాన్ని వాహనాలు వెళ్లలేని ప్రదేశాలకు తీసుకెళ్లడం కష్టం కావడంతో ఎక్కడికైనా తీసుకెళ్లేలా మరొకటి తయారు చేశారు.

తక్కువ ఖర్చుతో.. స్వచ్ఛమైన నీరు

ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల గిరిజన ప్రాంతాలకు వెళ్లి.. వారికి శుద్ధమైన నీటిని ఎలా అందించాలనే అంశంపై పరిశీలన చేస్తున్నారు. అక్కడున్న నీటి వనరులు, తక్కువ ఖర్చుతో స్వచ్ఛమైన నీటిని ఎలా అందించాలో శోధిస్తున్నారు. శుద్ధమైన నీటిని మారుమూల ప్రదేశాలకూ ఇవ్వాలన్నదే లక్ష్యమని రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

జలరక్షక్ బిరుదు

రాజేంద్రప్రసాద్‌ తయారు చేసిన పరిశోధన యంత్రానికి గతేడాది గాంధియన్‌ యంగ్ టెక్నాలజికల్‌ ఇన్నోవేషన్‌ అవార్డు లభించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. వృథా నీటిని అరికట్టడానికి చేస్తున్న కృషికి మెచ్చి కేంద్ర జలవనరుల శాఖ.. జల రక్షక్‌ అనే బిరుదు ఇచ్చింది.

ఇదీ చదవండి:

పది మంది పని.. చేసింది ఒక్కడే.. అదీ ఆరుపదుల వయసులో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.