ETV Bharat / state

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిజిటల్ వార్.. ఆ నలుగురి మధ్యే పోటీ..?

author img

By

Published : Mar 10, 2023, 5:39 PM IST

MLC election campaign
MLC election campaign

Digital campaign of MLC election in Uttarandhra: ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పోలింగ్ సమయం ముగియనుండడంతో ఉత్తరాంధ్రలో డిజిటల్ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో అందరి చూపు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపైనే ఉంది. అందుక్కారణం ఈసారి 37మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో భారీ ఉత్కంఠ నెలకొంది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. 37 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ.. ప్రధానంగా నలుగురి మధ్యే తీవ్రమైన పోటీ నెలకొందని తెలుస్తోంది.

Digital campaign of MLC election in Uttarandhra: ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పోలింగ్ సమయం ముగియనుండడంతో డిజిటల్ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో అందరి చూపు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపైనే ఉంది. అందుక్కారణం ఈసారి 37మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో భారీ ఉత్కంఠ నెలకొంది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. 37మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ.. ప్రధానంగా నలుగురి మధ్యే తీవ్రమైన పోటీ నెలకొందని తెలుస్తోంది. ఆ నలుగురు ఎవరెవరంటే?.. వైసీపీ తరుపు అభ్యర్థి బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌, టీడీపీ తరుపు అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు, బీజేపీ తరుపు అభ్యర్థి మాధవ్‌‌తో పాటు ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌) అభ్యర్థి కోరెడ్ల రమాప్రభల మధ్య పోటీ ఉండనుందని ఉత్తరాంధ్ర ఓటర్లు చర్చించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అటూ అధికార, ఇటూ విపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు ఎన్నికలకు సంబంధించి అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాలతో పాటు.. బ్యాలెట్ పెట్టెలు, సామాగ్రిని సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఇంటింటా ప్రచారం పూర్తి చేసుకున్న అభ్యర్థులు.. ఇప్పుడు డిజిటల్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఓటర్లుగా నమోదు చేసుకున్న వారి జాబితా ఆధారంగా చరవాణిలో సందేశాలు, వాట్సాప్ గ్రూపులు పెట్టి.. ఆ గ్రూపులలో దృశ్య ప్రచారాన్ని ప్రారంభించారు. ఓటర్లు తమను గెలిపిస్తే ఏయే కార్యక్రమాలను చేయనున్నారో ఆ సందేశాలను ఆ గ్రూపులలో పంపుతున్నారు.

ఇక, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం అన్ని పార్టీలలోని సీనియర్ నాయకులు రంగప్రవేశం చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కేంద్రాలలో బస చేసి ప్రచారానికి ఊపు తెస్తున్నారు. వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి సైతం విశాఖలో బస చేసి.. వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. వారి వెంట మంత్రులు ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, పిడిక రాజన్న దొర తదితరులు ప్రచారంలో పాల్గొంటున్నారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి డాక్టర్ వేపాడ చిరంజీవిరావుకు పార్టీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ నాయకులు బోండా ఉమా, బుద్ధా వెంకన్నలు విశాఖలోనే ఉండి ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజీపీ అభ్యర్థి మాధవ్‌కు.. బీజేపీ నేతలు సోము వీర్రాజు, ఎంపీ జీవియల్ నరసింహారావు, పార్టీ కేంద్ర కమిటీ సునీల్ దియోధర్‌లు విశాఖలోనే ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్సీగా మరోసారి మాధవ్ గెలిచేలా చేయాలనీ సాగుతున్నారు.

ఇక, వామపక్షాల అభ్యర్థి డాక్టర్ కోరెడ్ల రమాప్రభ తరుపున ప్రస్తుత పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఎన్ వెంకటరావు, మాజీ ఎమ్మెల్సీలు ఎంవిఎస్ శర్మ, లక్ష్మణ రావులు ప్రచారంలో పాల్గొని పీడీఎఫ్ గెలవడానికి కృషి చేస్తున్నారు. స్వతంత్రయ అభ్యర్థిగా ఉన్న నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్‌కు మాజీ సీబీఐ అధికారి జెడి లక్ష్మీ నారాయణ ప్రచారం చేస్తున్నారు. ప్రచార గడువు కూడా మరికొద్దీ గంటలో ముగియనుండడంతో బరిలో ఉన్న అభ్యర్థులు అన్ని వైపులా ప్రచారవేడిని పెంచారు.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నమోదు చేసుకున్న ఓటర్ల విషయానికొస్తే.. 2.87లక్షల ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరికోసం 331 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 37మంది అభ్యర్థులు బరిలో నిలిచారని.. ఓటింగ్‌కు కావాల్సిన బ్యాలెట్ పేపర్‌లను కర్నూల్ జిల్లాలో ముద్రించి విశాఖపట్నానికి తీసుకుని వచ్చినట్లు వెల్లడించారు. 13వ తేదీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల అధికారిగా డాక్టర్ మల్లిఖార్జున, ఎన్నికల పరిశీలకునిగా సిద్దార్ధ జైన్ అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులు పూర్తి చేశారు. సిబ్బందికి అందించే సామగ్రి కూడా సిద్ధం చేస్తున్నారు. పోలింగ్ అనంతరం 16వ తేదీ ఎన్నికల లెక్కింపును విశాఖ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో నిర్వహించడానికి ఏర్పాట్లను కూడా అధికారులు సిద్ధం చేశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.