మదనపల్లెలో 40వ రోజు లోకేశ్​ యువగళం పాదయాత్ర.. సాయంత్రం బహిరంగసభ

author img

By

Published : Mar 10, 2023, 12:35 PM IST

NARA LOKESH YUVA GALAM PADAYATRA

LOKESH YUVA GALAM PADAYATRA : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‍ చేపట్టిన యువగళం పాదయాత్ర.. 40వ రోజు అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో సాగుతోంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు దేవతానగర్ క్యాంప్ సైట్ వద్ద సెల్ఫీ విత్ నారా లోకేశ్​ కార్యక్రమంలో పాల్గొన్నారు.

NARA LOKESH YUVA GALAM PADAYATRA : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‍ చేపట్టిన యువగళం పాదయాత్ర 40వ రోజు మదనపల్లె నియోజకవర్గంలో సాగుతోంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు దేవతా నగర్ క్యాంప్ సైట్ వద్ద సెల్ఫీ విత్ నారా లోకేశ్​ కార్యక్రమం నిర్వహించారు. యువత, మహిళలు, చిన్నారులు లోకేశ్​తో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు. మదనపల్లె గ్రామీణ దేవతా నగర్ క్యాంప్ సైట్ నుంచి ప్రారంభించిన పాదయాత్ర పట్టణంలోకి ప్రవేశించింది. టీడీపీ నేతలు గజమాలలతో లోకేశ్​ను సత్కరించారు. మహిళలు దారిపొడవునా హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు. సాయంత్రం వరకు మదనపల్లెలో లోకేశ్‍ పాదయాత్ర నిర్వహించనున్నారు. టీకేఎన్ వెంచర్ అన్నమయ్య నగర్​లో జరగనున్న బహిరంగ సభలో లోకేశ్‍ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

లోకేశ్​కు సమస్యలు తెలిపిన బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి: యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్​కు.. రహదారి పై తారసపడుతున్న వ్యక్తులే కాకుండా వాహనాలపై వెళ్లే ప్రజలూ.. సమస్యలు తెలియజేస్తున్నారు. నిన్న మదనపల్లె నియోజకవర్గంలోని ఆరోగ్యవరం సమీపంలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్​కు .. పీలేరు వైపు వెళ్తున్న బస్సులో ఉన్న ఓ ప్రయాణికుడు అభివాదం చేశారు. లోకేశ్‍ బస్సు దగ్గరికి వెళ్లి మాట్లాడటంతో తన ఆవేదనను వెలిబుచ్చారు. ఢీ ఫార్మసీ చదువుతున్న తన కుమారుడికి ప్రభుత్వం నుంచి ఫీజు రాయితీ సొమ్ము రాలేదని తెలిపారు. కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేయడంతో లక్షా 80 వేల రూపాయలు అప్పు చేసి చెల్లించానని వివరించారు. విద్యార్ధులకు ఫీజు రాయితీల చెల్లింపులో ప్రభుత్వ వైఖరి పై ప్రశ్నించాలని లోకేశ్‍కు ఆయన సూచించారు. ఈ విషయంపై పోరాటం చేస్తామని ఆయనకు లోకేశ్‌ హామీ ఇచ్చారు.

లోకేశ్​ పాదయాత్ర 500 కిలోమీటర్లు: రాష్ట్రంలో యువత పడుతున్న సమస్యలు, మహిళలకు అండగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం మహాపాదయాత్రలో మరో పరిణామం చోటుచేసుకుంది. మదనపల్లె నియోజకవర్గంలో యువగళం పాదయాత్క 500 కిలో మీటర్ల మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా లోకేశ్‌ టమాట ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు హామీ ఇస్తూ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం చేనేత కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు చరఖా తిప్పి.. నేతన్నలను ఉత్సాహపరిచారు.

31వ రోజుకి 400 కిలోమీటర్లు: నారా లోకేశ్‍ చేపట్టిన యువగళం పాదయాత్ర 31వ రోజుకి నాలుగు వందల కిలోమీటర్లను పూర్తి చేసుకుంది. చంద్రగిరి నియోజకవర్గం గాదంకి, నేండ్రగుంట మీదుగా పాదయాత్ర సాగింది. పాదయాత్ర నేండ్రగుంటకు చేరుకునే సరికి 400 కిలో మీటర్లు పూర్తైన సందర్భంలో శిలాఫలకాన్ని ​ ఆవిష్కరించారు. 400 కిలో మీటర్లు పూర్తైన సందర్బంగా నరేంద్రకుంటలో 10 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.