ETV Bharat / state

నిరుపయోగంగా తుపాను రక్షిత భవనాలు

author img

By

Published : Sep 26, 2019, 1:44 PM IST

తీర ప్రాంతాల్లో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని మత్యకారుల కోసం … నిర్మించిన తుపాను రక్షణ భవనాల్లోనే సంరక్షణ కరవైంది. ప్రజల్ని ఆదుకోవాల్సిన పునరావాస కేంద్రాల్ని... ప్రభుత్వం ఆదుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి మత్స్యకారుల కోసం... ఏర్పాటు చేసిన తుపాను రక్షిత భవనాలు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి.

tupan-shelters

నిరుపయోగంగా తుపాను రక్షిత భవనాలు

విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో సుమారు 30 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉండగా... 35 గ్రామాల్లో దాదాపు 20 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. తుపానులు ఏర్పడినప్పుడు వీరిని రక్షించేందుకు ... నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్ రాయవరం మండలాల్లో 11 తుపాను రక్షిత భవనాలను నిర్మించారు. ఒక్కొక్క భవనానికి దాదాపు కోటిన్నర ఖర్చు చేసి...కేంద్ర విపత్తుల నిర్వహణ సంస్థ వీటిని నిర్మించింది. తుపాను సూచనలను ముందుగానే గుర్తించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన శాటిలైట్ సిగ్నల్ పరికరాలను భవనాల పైభాగంలో అమర్చారు. అన్ని సౌకర్యాలు ఉన్నా నిర్వహణ లోపంతో... ఈ భవనాలు ప్రస్తుతం ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నాయి.

తుపాను రక్షణ భవనాల్లో కనీస సాకర్యలు కరవయ్యాయి. తాగునీటి కోసం ఏర్పాటు చేసిన మోటర్లు మరమ్మతులకు గురై మూలకు చేరాయి. కాపలాదారులు లేకపోవడంతో విద్యుత్ పరికరాలను దొంగలించారు. తెగిపోయి వేలాడుతున్న వైర్లు, తిరగని ఫ్యాన్లు... వెలగని దీపాలు ఈ భవనాల్లో దర్శనమిస్తున్నాయి. మరుగుదొడ్లలోనికి వెళ్లేందుకు కనీసం సాహసించలేనంత అధ్వానంగా తయారయ్యాయని స్థానికులు వాపోతున్నారు. కొన్ని గ్రామాల్లో పాత భవనాలు శిథిలావస్థకు చేరి కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం రక్షణ భవనాల నిర్వహణ పట్ల చొరవ చూపకుంటే... రాబోయే కాలంలో కష్టాలు తప్పవని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపానుల నుంచి రక్షించేందుకు నిర్మించిన పునరావాస భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మత్స్యకారులు కోరుతున్నారు .

Intro:AP_TPT_31_26_hathya_av_AP10013 యాచకుడు ని హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు


Body:చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బిక్షాటన చేస్తున్న జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి హత్య చేశారు. పట్టణంలోని పెద్ద మసీదు సమీపంలో దుకాణం ఎదుట నిద్రిస్తుండగా హత్యకు కు గురయ్యాడు. సమాచారం అందుకున్న ఒకటో పట్టణం పోలీస్ స్టేషన్ సీఐ నాగార్జున రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలను ఆరా తీశారు. డాగ్ స్క్వాడ్ ,వేలిముద్రలు నిపుణుల సహకారంతో కేసును ఛేదించి పనిలో నిమగ్నమయ్యారు. యాచకుడు ఎవరు.. హత్యకుగల కారణాలు తెలియాల్సి ఉంది.


Conclusion:చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో యాచకుడు హత్య. ఈటీవీ భారత్, శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం, 8008574559.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.