ETV Bharat / state

విశాఖలో ఈ నెల 16 నుంచి అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు

author img

By

Published : Dec 9, 2019, 7:01 PM IST

విశాఖ సాగర తీరం అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలకు మరోసారి వేదిక కాబోతోంది. ఈనెల 16 నుంచి ఆర్కే బీచ్​లో పోటీలు ప్రారంభం కానున్నట్లు ఏపీ వాలీబాల్ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే గణబాబు తెలిపారు.

International Beach Volleyball Tournament on Visakhapatnam
విశాఖ సాగరతీరంలో అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు

విశాఖ సాగరతీరంలో అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు

విశాఖలో ఈనెల 16 నుంచి ఆర్కే బీచ్​లో అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు ప్రారంభం కానున్నట్లు ఏపీ వాలీబాల్ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. ఏవీసీ బీచ్ వాలీ బాల్ కాంటినెంటల్ కప్ పేరిట ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పోటీల్లో ఆసియా దేశాలైన ఇరాన్, కజికిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్, బంగ్లాదేశ్, భారత్ నుంచి క్రీడా జట్లు పాల్గొంటాయని తెలిపారు. గతంలో అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు విశాఖలో జరిగినా.. ఈసారి జరగనున్న పోటీలకు ప్రత్యేకత ఉందన్నారు. ఇక్కడ విజేత జట్లు ఆసియా స్థాయిలో మరో మెగా టోర్నీలో పాల్గొంటాయని అక్కడ ప్రతిభ కనబరిస్తే రాబోయే ఒలింపిక్స్​లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తాయన్నారు. ఈ పోటీలను తిలకించేందుకు నగరవాసులకు ఉచిత ప్రవేశాన్ని కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇవీ చూడండి:

ఉత్సాహంగా రాష్ట్రస్థాయి ఆటల పోటీలు

Intro:Ap_Vsp_91_09_International_Beach_Vollyball_Ab_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్ : విశాఖ సిటీ
8008013325
( ) సాగరతీరం విశాఖ అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలకు మరోసారి వేదిక కాబోతోంది. ఈనెల 16వ తేదీ నుంచి ఆర్కే బీచ్ లో అంతర్జాతీయ పోటీలు ప్రారంభం కానున్నట్లు ఏపీ వాలీబాల్ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే గణబాబు విశాఖలో తెలిపారు.


Body:ఏవీసీ బీచ్ వాలీ బాల్ కాంటినెంటల్ కప్ పేరిట ఈ పోటీలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. ఆసియా దేశాలైన ఇరాన్, కజికిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్, బంగ్లాదేశ్ భారత్ దేశాల నుంచి క్రీడా జట్లు పాల్గొంటాయని ఆయన తెలిపారు.


Conclusion:గతంలో అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు విశాఖలో జరిగినా.. ఈసారి జరగనున్న పోటీలకు ప్రత్యేకత ఉందన్నారు. ఇక్కడ విజేత జట్లు త్వరలో ఆసియా స్థాయిలో మరో మెగా టోర్నీలో పాల్గొంటాయని అక్కడ ప్రతిభ కనబరిస్తే రాబోయే ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తాయన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూజరిగే ఈ పోటీలను తిలకించేందుకు నగరవాసులకు ఉచిత ప్రవేశాన్ని కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

బైట్: గణబాబు, ఏపీ వాలీబాల్ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.