ETV Bharat / state

పూర్ణా మార్కెట్ మా జీవన విధానం.. ప్రభుత్వంపై పోరాటమే అంటున్న వ్యాపారులు..

author img

By

Published : Feb 1, 2023, 12:08 PM IST

Purna market : దాదాపు 9 దశాబ్దాల చరిత్ర.. వేల మందికి ఉపాధి.. నిత్యం ఎంతో మంది ప్రజలకు ఉపయోగపడే పూర్ణా మార్కెట్ అనగానే.. విశాఖ నగరం గుర్తొస్తుంది. ప్రభుత్వం.. ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో పూర్ణామార్కెట్​ను అనుయాయులకు అప్పగించే ప్రతిపాదనలు తక్షణమే విరమించుకోవాలని వర్తకులు డిమాండ్‌ చేస్తున్నారు.

పూర్ణా మార్కెట్
పూర్ణా మార్కెట్

పూర్ణా మార్కెట్

Purna market : ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో పూర్ణామార్కెట్​ను అనుయాయులకు అప్పగించే ప్రతిపాదనలు తక్షణమే విరమించుకోవాలని వర్తకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఫిబ్రవరి 1న జరిగే జీవీఎంసీ కౌన్సిల్‌లో వైఎస్సార్​సీపీ పాలకవర్గ నిర్ణయాలను అన్ని రాజకీయపార్టీల కార్పొరేటర్లు ముక్తకంఠంతో వ్యతిరేకించి ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కాపాడాలని కోరుతున్నారు.

పీపీపీ విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి : విశాఖ నగరానికి కీలకమైనది పూర్ణామార్కెట్‌. దీనినే సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మార్కెట్‌ అని అంటారు. హోల్‌సేల్‌తోపాటు ప్రజలకు చౌకగా సరుకులు లభించే మార్కెట్‌. జీవీఎంసీ లెక్కల ప్రకారమే సుమారు 430 శాశ్వత, 200 తాత్కాలిక దుకాణాలు, లోపల, బయట మరో 100మంది చిరువ్యాపారులు కలిపి సుమారు 650మంది ఉన్నారు. 1.35 ఎకరాల విస్తీర్ణంలో ఈ మార్కెట్‌ ఉంది. పీపీపీ మోడల్‌లో దీనిని అభివృద్ధి చేస్తామని ప్రతిపాదనలు చేశారు. కాగా, వందల మందికి ఉపాధి పోతుందని అగ్రహిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు లాభం పొందుతారని.. చిరువ్యాపారులు, ప్రజల మీద భారం పెరుగుతుందని... పీపీపీ ప్రతిపాదనను విరమించాలని పోరాటం చేస్తామంటున్నారు వర్తకులు. పూర్ణ మార్కెట్ 1935 నుంచి ఉందని, అటువంటి పురాతన నిర్మాణం కాపాడాలని కోరుతున్నారు.

మా పోరాటం కొనసాగిస్తాం

మా తాతల కాలం నాటి నుంచి ఉన్న ఈ మార్కెట్​తో మాకు, ప్రజలకు ఎంతో అనుబంధం ఉంది. ఉత్తరాంధ్ర నుంచి చాలా మంది ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ప్రభుత్వం, అధికారులు ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని వర్తకులందరం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా పోరాటం కొనసాగిస్తాం. మా తండ్రులు అప్పగించిన వ్యాపారం కొనసాగిస్తున్నాం. ఉన్నపళంగా మార్కెట్ ను తీసేస్తామంటే.. దీనిపై ఆధారపడిన దాదాపు 5వేల కుటుంబాల పరిస్థితి ఏమిటి..?

- ప్రభుత్వంపై మండిపడుతున్న వ్యాపారులు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.