ETV Bharat / state

విశాఖలో ప్రోటోకాల్​ వివాదం.. తెదేపా, వైకాపా నేతల తోపులాట

author img

By

Published : Aug 23, 2019, 7:54 PM IST

విశాఖలో ఎంవీపీ కాలనీ సెక్టార్-7లో హుద్‌హుద్ తుపాను ఇళ్ల ప్రారంభోత్సవం వేడుక రసాభాసగా మారింది. వైకాపా, తెదేపా నేతల మధ్య తోపులాట జరిగింది.

వైకాపా

తెదేపా వైకాపా, నేతల మధ్య వివాదం

విశాఖ తూర్పు నియోజకవర్గంలో హుద్ హుద్ తుపాను బాధితుల కోసం ఎంవీపీ కాలనీలో నిర్మించిన ఇళ్ల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఇళ్ల ప్రారంభానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావులతో సహా వైకాపా నేతలంతా హాజరయ్యారు. విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్న తెలుగుదేశం నేత వెలగపూడి రామకృష్ణబాబుకు అహ్వానం అందలేదు. ఎక్కడా పేరు కూడా లేకుండా వ్యవహరించటంతో తెదేపా కార్యకర్తలు అందోళనకు దిగారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కార్యక్రమం బయటే వేచి ఉన్నారు. ప్రతిగా వైకాపా కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఈలోగా వివాదం ముదిరి ఇరుపక్షాల మధ్య తోపులాట జరిగింది. తెదేపా కార్యకర్తల నిరసనల మధ్యనే మంత్రి అవంతి ఇళ్లను ప్రారంభించారు.

Intro:ap_vzm_37_23_bhaktula_takidi_avb_vis_ap10085 దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు శ్రావణమాసం 4వ శుక్రవారం దుర్గా దేవి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి


Body:విజయనగరం జిల్లా లో దుర్గామాత ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి తల్లి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు పార్వతీపురం లోని దుర్గ ఆలయాలు భక్తులతో కళకళలాడాయి కొత్తవలస బెల్గాం వెంకంపేట గోలీలు జగన్నాధపురం ప్రాంతాలలోని దుర్గా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి పసుపు కుంకుమ చీర గాజులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు కొత్తవలస దుర్గాలయం లో ఉదయం 5 గంటల నుంచే భక్తుల తాకిడి కనిపించింది అమ్మవారు శ్రావణ లక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు


Conclusion:లక్ష్మీదేవి అవతారం లో దుర్గమ్మ దర్శనం తల్లి దర్శించేందుకు బారులు తీరిన భక్తులు మొక్కులు తీర్చుకున్న భక్తులు నవ దుర్గల కు పూజ లు చేస్తున్న భక్తులు భక్త క్రికెట్ లాడిన ఆలయం దుర్గా దేవి దర్శనానికి వేచిఉన్న భక్తులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.