ETV Bharat / state

vishaka: విద్యార్థులు ఉన్నారు.. ఉపాధ్యాయులేరీ?

author img

By

Published : Nov 1, 2021, 4:28 PM IST

నేటి బాలలు రేపటి పౌరులుగా ఉన్నతంగా స్థిరపడాలంటే... మంచి విద్యనభ్యసించాలి. విద్యార్థికి సరైన పునాది వేయగలిగేది ఉపాధ్యాయుడే. కానీ విశాఖలోని ఏజెన్సీ ప్రాంతంలో చాలా పాఠశాలల్లో అసలు ఉపాధ్యాయులు లేరు. ప్రాథమిక పాఠశాలల తాళాలు తీసే పరిస్థితి కూడా లేదు. దీంతో పిల్లలు చదువుకు దూరమవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏజెన్సీ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థుల ఇబ్బందులు
ఏజెన్సీ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థుల ఇబ్బందులు

ఏజెన్సీ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థుల ఇబ్బందులు

విశాఖ పాడేరు ఏజెన్సీలోని 139 గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల్లో ఉపాధ్యాయులు లేరు. ఈ పాఠశాలల్లో తాత్కాలికంగా పనిచేసే సుమారు 900 మంది సీఆర్​టీ ఉపాధ్యాయులను రెన్యువల్ చేయకపోవటంతో వారు స్కూలుకు రావటం మానేశారు. దీంతో విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు లేక చదువుకు దూరమవుతున్నారు. పాఠశాలల తాళాలు కూడా తెరవకపోవటంతో కొన్ని గ్రామాల్లో పిల్లలు ఆరుబయటే కూర్చుంటున్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులే పిల్లలకు క్రమశిక్షణ నేర్పిస్తున్నారు.

రెండేళ్లుగా కరోనాతో పాఠశాలలకు వెళ్లే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉపాధ్యాయులు లేక పిల్లల చదువు కొనసాగటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. వేరే పాఠశాలలకు పంపించాలనుకున్నా. టీసీలు ఇచ్చేవారు కూడా లేరన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం కూడా అమలు కావడం లేదని తెలిపారు. పాఠశాలలకు పంపిన బియ్యం, గుడ్లు విద్యార్థులకే ఇచ్చేస్తున్నామని మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు తెలిపారు.

ఉపాధ్యాయులు రాకపోవడంతో కొన్ని పాఠశాలల్లో డీఎడ్‌ చదివిన నిరుద్యోగులు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఉపాధ్యాయులను రెన్యువల్ చేయకపోవడంపై ప్రభుత్వ తీరును. స్థానికులు తప్పుపట్టారు. ఉపాధ్యాయుల సమస్యపై స్థానిక ఎమ్మెల్యేలు మంత్రి పుష్ప శ్రీవాణి, ఎస్టీ కమిషన్ అధ్యక్షుడు రవి బాబుకు వినతి పత్రాలు సమర్పించినా.. ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి:
రాష్ట్రంలో మిగిలిన కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.