ETV Bharat / state

కేంద్ర నిధులు "దారి" మళ్లించారు..మరి రహదారులు ఎప్పడు వేస్తారో..

author img

By

Published : Dec 19, 2022, 7:33 AM IST

YCP Government Diverted PMGSY Funds: గ్రామీణ రహదారులపై మోకాళ్ల లోతు పడిన గుంతలను పూడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం తట్టెడు మట్టిపోయడం లేదు. గతుకుల రోడ్లతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నా ఎవరికీ పట్టడం లేదు. మరోవైపు ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద గ్రామీణ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను కూడా రాష్ట్రం విడుదల చేయడం లేదు. వీటిని సొంత అవసరాలకు మళ్లిస్తోంది.

PMGSY Funds
.పీఎమ్​జీఎస్​వై నిధులు

YCP Government Diverted PMGSY Funds: ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన..పీఎమ్​జీఎస్​వైకి సంబంధించిన రెండో విడతలోని రెండు కేటగిరీల నిధులు 144.68 కోట్లను రాష్ట్రానికి కేంద్రం అక్టోబరు 31న కేటాయించింది. దీనికి తన వాటా 110 కోట్లను కలిపి మొత్తం 254.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా విడుదల చేయడం లేదు. కేంద్రం నుంచి నిధులు వచ్చిన 21 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ రహదారుల అభివృద్ధి సంస్థ..ఎపీఎస్​ఆర్​ఆర్​డీఎ.. సింగిల్‌ నోడల్‌ ఖాతాకి జమ చేయాలన్న నిబంధననూ రాష్ట్రం గాలికొదిలేసింది. దీంతో పనులు చేసిన గుత్తేదారులకు రూ.250 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

పీఎమ్​జీఎస్​వై నిధులు రాష్ట్రానికి కేటాయిస్తున్నా విడుదలలో జాప్యం చేస్తుండటంతో కేంద్రం కొత్తగా షరతు విధించింది. రెండో విడతలో ఇప్పటికే కేటాయించిన నిధులకు రాష్ట్ర వాటాను కలిపి డిసెంబరు నెలాఖరులోగా మొత్తం విడుదల చేయాలని, నిధుల వినియోగ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు స్టేట్‌మెంట్లను తమకు పంపితేనే.. మూడో విడత ఇవ్వాల్సిన 149 కోట్లను కేటాయిస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో పీఎమ్​జీఎస్​వై పనుల పురోగతిపై ఈనెల 7న కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహించిన సమీక్షలో పలు రాష్ట్రాలు కేంద్రం నిధులను సొంతానికి వాడుకున్న విషయం ప్రస్తావన కొచ్చింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తావన కూడా వచ్చింది.

కేంద్ర నిధులు "దారి" మళ్లించారు..మరి రహదారులు ఎప్పడు వేస్తారో..

రాష్ట్రానికి పీఎమ్​జీఎస్​వై నాలుగవ విడత నిధుల కేటాయింపు కష్టమే. ఇప్పటికే మూడు విడతల నిధులు వచ్చి ఉంటే.. కేంద్రం జనవరిలో నాలుగవ విడత కేటాయించేది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పీఎమ్​జీఎస్​వై కింద కేంద్రం రాష్ట్రానికి రెండు కేటగిరీల్లో 1,004 కోట్ల విలువైన పనులు మంజూరు చేసింది. వాటితో 187 రోడ్లు, 28 వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఈ పనులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. అంచనా విలువలో కేంద్రం తన వాటా కింద 60% నిధులు కేటాయిస్తుండగా.. రాష్ట్రం 40% సమకూర్చాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.