ETV Bharat / state

విశాఖలో ఆకట్టుకున్న అందాల పోటీలు

author img

By

Published : Dec 22, 2022, 4:37 PM IST

beauty pageant
అందాల పోటీ

Fashion Show in Visakha: విశాఖలో అందాల పోటీలు నిర్వహించారు. స్టార్ ఆంధ్రప్రదేశ్ సీజన్ -1 పోటీల్లో భాగంగా విశాఖలోని ఓ హోటల్​లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో సుమారు 1500 మంది యువతీ యువకులు ఆడిషన్స్​కు రాగా.. కేవలం 25 మందిని ఎంపిక చేసి.. 10 మందికి మాత్రమే సీజన్ -1 ఫైనల్స్​లో పాల్గొనేందుకు అవకాశం వచ్చింది.

Fashion Show in Visakha: స్టార్ ఆంధ్రప్రదేశ్ సీజన్-1 పోటీల్లో భాగంగా విశాఖలో అందాల పోటీలను నిర్వహించారు. విశాఖలోని ఓ హోటల్​లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు రాష్ట్రంలోని 1500 మంది యువతీ యువకులు ఆడిషన్స్​కు రాగా.. కేవలం 25 మందిని ఎంపిక చేసి.. 10 మందికి మాత్రమే సీజన్-1 ఫైనల్స్​లో పాల్గొనేందుకు అవకాశం కల్పించామని క్లాసిక్ ఎంటర్​టైన్​మెంట్​ నిర్వాహకులు దువ్వాడ రోహిత్ తెలిపారు. ట్రెడిషన్ రౌండ్​లో పోటీదారులు సంప్రదాయ వస్త్రాలతో చేసిన ర్యాంప్ వాక్ అందరినీ ఆకట్టుకుంది.

యువతులు తమదైన శైలిలో చీరకట్టుతో తమ హావభావాలతో ర్యాంప్​పై నడుస్తూ.. ప్రొఫెషనల్ మోడళ్లకు ఏ మాత్రం తీసిపోనట్టుగా చేసిన ప్రదర్శన అబ్బురపరిచింది. వీరితో పాటు పలు ఫ్యాషన్ కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా పాశ్చాత్య దుస్తులతో ర్యాంప్ వాక్ చేశారు.

విశాఖలో అందాల పోటీలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.