ETV Bharat / state

ఫ్లెక్సీ రంగం కార్మికులను ఆదుకుంటాం.. : నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌

author img

By

Published : Dec 22, 2022, 12:57 PM IST

Ban on flexi will come into effect from January 26: జనవరి 26 నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేదం అమల్లోకి వస్తోందని రాష్ట్ర పర్యావరణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ తెలిపారు.ప్లెక్సీ ప్రత్యామ్నయ మార్గాలపై విజయవాడలో ఆయన వర్క్ షాప్ ను ప్రారంభించారు. ఈ రంగంపై ఆధారపడిన వారికి నూతన పథకాలు ప్రవేశపెట్టి, ప్రభుత్వం అండగా ఉంటుందని .. నీరభ్ వెల్లడించారు.

Ban on plastic will come into effect from January 26
జనవరి 26 నుంచి ప్లాస్టిక్ నిషేదం

Ban on flexi will come into effect from January 26: జనవరి 26వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేదం అమల్లోకి వస్తోందని రాష్ట్ర పర్యావరణ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ అన్నారు. ప్లెక్సీ ప్రింటింగ్ రంగంపై ఆధారపడిన వారికి ప్రత్యామ్నయం చూపించాలనే ఉద్దేశంలో విజయవాడలోని ఓ కళ్యాణ మండపంలో ప్లెక్సీ వినియోగం, ప్రత్యామ్నయ మార్గాలపై అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా నీరభ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ రంగం పై ఆధారపడిన వారికి నూతన పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలిచేలా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల సమస్య రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయిందని, నివారణకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయంగా చెన్నైలో జరుగుతున్న మార్పులను ఇక్కడ కూడా అనుసరించాలని సూచించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.