ETV Bharat / state

'మైనింగ్​ వ్యవహారంలో సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోండి'

author img

By

Published : Jul 17, 2020, 10:57 PM IST

అక్రమ మైనింగ్​ వ్యవహారంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లిలో ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. మైనింగ్​ దాడుల్లో భారీగా జరిమానా విధించిన అధికారిని అభినందించారు.

social avtivists given letter to anakapalle rdo on mining issue in visakha district
ఆర్డీవో సీతారామారావుకు ప్రజా సంఘాల సభ్యులు వినతి పత్రం

విశాఖ గ్రామీణ జిల్లాలో ఇటీవల జరిగిన మైనింగ్ దాడుల్లో భారీగా జరిమానా విధించిన మైనింగ్ విజిలెన్స్ అధికారిని అనకాపల్లి ప్రజా సంఘాల సభ్యులు అభినందించారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో సహకారం ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి ఆర్డీవో సీతారామారావుకు ప్రజా సంఘాల సభ్యులు వినతి పత్రం అందజేశారు. అనకాపల్లితో పాటు గ్రామీణ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ మాఫియా ఆగడాలు శృతి మించాయని ప్రజా సంఘాల సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల సభ్యులు చిన్ని యాదవ్, బొడ్డేడ అప్పారావు, మట్టా కుమార్, జోగారావు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

క్రషర్​ దగ్గర ప్రమాదం..చేయి పోగొట్టుకున్న 12 ఏళ్ల బాలుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.