Food Poison: కలుషిత ఆహారం తిని.. 40 మంది విద్యార్థినులకు అస్వస్థత!

author img

By

Published : Nov 22, 2021, 9:53 PM IST

Updated : Nov 23, 2021, 5:41 AM IST

students suffer with Food Poison at vishaka district

కలుషిత ఆహారం (Food Poison in school) తిని 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన విశాఖ జిల్లా పాడేరులో చోటుచేసుకుంది.

విశాఖ మన్యం పాడేరు కేజీబీవీ పాఠశాలలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేసిన అనంతరం వాంతులు, కడుపునొప్పితో (Food Poison)ఇబ్బంది పడ్డారు. సిబ్బంది హుటాహుటిన బాధితులను పాడేరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఆస్పత్రిలో సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడంతో .... తోటి బాలికలే అస్వస్థతకు గురైన వారికి సపర్యలు చేశారు. తహసీల్దార్ ప్రకాశరావు ఆస్పత్రికి వచ్చి ఇతర ఆసుపత్రుల నుంచి వైద్య సిబ్బందిని రప్పించారు. పాఠశాలలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని విద్యార్థినులు చెబుతున్నారు. తాగునీటి ట్యాంకు నాచు పట్టి ఆహారంలో కలవడం వల్లే ఆహారం కలుషితం అయ్యిందని విద్యార్థినులు అంటున్నారు.

కలుషిత ఆహారం తిని.. 40 మంది విద్యార్థినులకు అస్వస్థత!

ఇదీ చదవండి

cheating woman arrested: డాక్టర్‌ కావాలనుకొని చీటర్‌ అయ్యింది... పోలీసులకు చిక్కింది

Last Updated :Nov 23, 2021, 5:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.