ETV Bharat / state

వికేంద్రీకరణతోనే అభివృద్ధి.. విశాఖ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తల అభిప్రాయం

author img

By

Published : Sep 26, 2022, 10:31 AM IST

Round Table Meeting : వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతుందని, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ప్రాంతం, విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందుతాయని నగరంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులు అభిప్రాయపడ్డారు. విశాఖ గాది రాజు ప్యాలస్ వేదికగా వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

Round Table Meeting
Round Table Meeting

Round Table Meeting In Visakha : విశాఖ గాది రాజు ప్యాలస్ వేదికగా మూడు రాజధానుల వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయం సబబేనంటూ మాజీ ఉప కులపతులు ఆచార్య బాల మోహన్ దాస్, ఆచార్య జీఎస్ఎన్ రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తునట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అమరావతితో కూడిన రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందని.. విశాఖ ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. విశాఖ అభివృద్ధి కావడం రాష్ట్ర ప్రగతికి ముఖ్య ఘట్టంగా పలువురు అభివర్ణించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, బూడి ముత్యాల నాయుడు, మంత్రి బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, మాజీ ఉపకులపతులు ఆచార్య జీఎస్ఎన్ రాజు, ఆచార్య బాల మోహన్ దాస్ లు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.