ETV Bharat / state

మన్యంలో పెరిగిన దారిదోపిడీలు... అప్రమత్తమైన పోలీసులు...

author img

By

Published : Jan 19, 2021, 5:36 PM IST

విశాఖ మన్యంలో ఇటీవల జరుగుతున్న దారి దోపిడీల కారణంగా మన్యం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక్కడకు చేరుకునేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.

Police are on high alert due to increased looting in Visakhapatnam
మన్యంలో పెరిగిన దారిదోపిడీలు... అప్రమత్తమైన పోలీసులు...

ఇటీవల జరిగిన దారి దోపిడీల కారణంగా విశాఖ మన్యం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఇక్కడకు వచ్చేవారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరానికి తగ్గట్టు ప్రయాణాలను పరిమితం చేసుకోవాలని పోలీసులు తెలిపారు. గూడెంకొత్తవీధి నుంచి సీలేరు వెళ్లే మార్గంలో రాత్రిపూట ప్రయాణాలు మానుకోవాలని అన్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

ఈ క్రమంలో పలుచోట్ల హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి విశాఖ ఏజెన్సీకి వెళ్లి ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు. వీటిని నర్సీపట్నం నుంచి చింతపల్లి వెళ్లే దారిలో, గొలుగొండ మండలం కృష్ణదేవిపేట నుంచి పెద్ద వలస మీదుగా, గూడెం కొత్తవీధి వెళ్లేదారిలో, తదితర మన్యం ముఖద్వారాల్లో ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: వెంకుపాలెంలో అగ్నిప్రమాదం.. గడ్డివాములు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.