ETV Bharat / state

దేశం ఉన్నతస్థితిలో ఉండాలంటే..యువత నిజాయితీగా శ్రమించాలి: నారాయణమూర్తి

author img

By

Published : Dec 18, 2022, 12:14 PM IST

Andhra University Alumni Association: దేశాన్ని ఉన్నత స్థితిలో ఉంచేందుకు యువత నిజాయతీగా శ్రమించడం ఒక్కటే మార్గమని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అన్నారు. విశాఖలో పూర్వ విద్యార్థుల సంఘం ఆరో మహా సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. నేడు టెక్నాలజీ అన్ని రంగాల్లోనూ కీలక పాత్ర పోషిస్తోందని డిజిటల్‌ ఇండియాగా భారత్‌ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందని..జిఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు అన్నారు.

narayanamurthy
narayanamurthy

Andhra University Alumni Association: దేశాన్ని ఉన్నత స్దితిలో ఉంచేందుకు యువత నిజాయితీగా శ్రమించడం ఒక్కటే మార్గమని, ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకులు ఎన్ ఆర్ నారాయణమూర్తి అన్నారు. వాళ్లే మార్గదర్శులు అవుతారని, ఇలా శ్రమించిన వారే విదేశాలలో మన దేశానికి నిజమైన రాయబారులుగా ఉన్నారన్నారు. విశాఖలో పూర్వ విద్యార్ధుల సంఘం ఆరో మహా సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై.. యువతకు దిశానిర్దేశం చేశారు. కెరీర్​ను ఎంచుకోవడం, దానిపై అవిశ్రాంతంగా శ్రమించడం, అందులో ఉన్నత స్ధితిని సాధించడం వంటివి తమ లక్ష్యాలుగా నిర్దేశించుకోవాలని సూచించారు. భారత్ గెలిస్తేనే మీరంతా గెలుస్తారని,.. భారత్ గెలవలేకపోతే గెలవలేరన్న వాస్తవాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. తాను కలలు గన్న భారతదేశాన్ని యువత సాధిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వివిధ సందర్బాలలో సవాళ్లను ఎదుర్కొనేందుకు అనుభవాలను ఆయన విద్యార్ధులతో పంచుకున్నారు.

సమావేశంలో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రసాదరెడ్డి పూర్వ విద్యార్ధులు, అధ్యాపకులు అడిగిన వివిధ ప్రశ్నలను నారాయణ మూర్తిని అడిగి వన్ టు వన్ పద్దతిలో సమాధానాలు రాబట్టారు. ఇంజినీరింగ్​లో అందరూ ఐటి, కంప్యూటర్ వైపు వెళ్తున్నారు. వారికి సరైన మార్గదర్శనం చేయండి అని అడిగిన ప్రశ్నకు.. తాను యువతను తప్పుబట్టలేనన్నారు. వారు కంప్యూటర్ సైన్స్, ఐటీనే ప్రధానంగా ఎన్నుకుంటున్నారంటే గతంలో కంటే మంచి జీవితాన్ని అనుభవించాలన్న వారి తాపత్రయం అర్ధం చేసుకోవాలి. మిగిలిన ఇంజినీరింగ్ సబ్జెక్టులు కూడా ప్రాచుర్యంలోకి రావాలంటే.. దానిపై తప్పకుండా పరిశ్రమ దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. నాయకత్వం అనేది ప్రజల ఆకాంక్షల నుంచి వస్తుందని, దీనికి ప్రత్యేకంగా మంత్రాలు అంటూ ఉండవని, నిజాయితీగా శ్రమించడంఒక్కటే మార్గమన్నారు.

విశాఖలో జరిగిన ఆరో పూర్వ విద్యార్థుల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన నారాయణమూర్తి

నేటి యువత వారిలో ఉన్న లోపాల్ని, పరిమితుల్ని అధిగమించేలా కష్టపడాలి. మీరు అనుకున్నలక్ష్యాన్నిసాధించడం కోసం... నేను చెప్పే విజయ రహస్యం ఏమిటంటే ముందుగా మీరు మీ సామర్థ్యాన్ని గుర్తించాలి. నేను ఇది చేయగలను అని నమ్మాలి. ఆ లక్ష్య సాధన కోసం కఠోర శ్రమ చేయాలి. : నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు

టెక్నాలజీ అనేది మానవ జీవితంలో నేడు అతి ముఖ్యమైన సాధనం. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా టెక్నాలజీ వినిమోగానికి పెద్దపీట వేస్తోంది. దాని కారణంగా ప్రపంచంలోనే నేడు అత్యధికంగా డిజిటల్‌ లావాదేవీలు ఇండియాలోనే జరుగుతున్నాయి. : గ్రంధి మల్లిఖార్జునరావు, జీఎంఆర్ సంస్థల అధినేత

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.