ETV Bharat / state

వృద్ధురాలి హత్య కేసులో యువకుడి అరెస్టు

author img

By

Published : Nov 19, 2020, 10:32 AM IST

విశాఖలో వృద్ధురాలి హత్య కేసులో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 13న భీమిలి నియోజకవర్గ పరిధిలో పాపాయమ్మ అనే వృద్ధురాలి గొలుసు దొంగిలించేందుకు యువకుడు యత్నించాడు. వృద్ధురాలిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. మూడు రోజుల పాటు చికిత్స పొందుతూ వృద్ధురాలు మరణించింది.

man arrest in old women murder case at vishaka
man arrest in old women murder case at vishaka

విశాఖలో హత్యా నేరం కింద గణేష్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. భీమిలి నియోజరవర్గ పరిధిలో పాపాయమ్మ అనే వృద్ధురాలి గొలుసు దొంగిలించేందుకు యత్నిస్తూ గణేష్ భౌతిక దాడి చేసినట్లు నేర విభాగం అదనపు డీసీపీ వెల్లడించారు. ఈ నెల 13న దాడి జరిగిన తర్వాత వృద్ధురాలు మూడు రోజుల పాటు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.

ఇదీ చదవండి:

విజయనగరం మన్యంలో మృత్యుఘోష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.