ETV Bharat / state

తెలుగు భాష పరిరక్షణకు "లిపి డాట్​ గేమ్​".. ఆవిష్కరించిన విశాఖ వాసి

author img

By

Published : Dec 26, 2022, 10:06 AM IST

LIPI DOT GAME : ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషను బతికించుకునే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ది చెందిన వాటిని వినియోగించుకునేందుకు టెక్నో క్రాట్స్ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా ఉపకరణాలు ఆంగ్ల భాషలో విస్తృతంగా వాడకంలో ఉన్నాయి. విశాఖ నుంచి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిన సాగర్‌ అనిసింగరాజు.. దీని కోసం ప్రత్యేకంగా.. "లిపి డాట్‌ గేమ్‌" అన్న దాన్ని రూపొందించారు.

LIPI DOT GAME
LIPI DOT GAME

LIPI DOT GAME: సాంకేతికతను ఉపయోగించి.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషను పరిరక్షించుకునేందుకు టెక్నో క్రాట్‌ ముందుకు వస్తున్నారు. విశాఖ నుంచి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిన సాగర్‌ అనిసింగరాజు.. దీని కోసం ప్రత్యేకంగా.. "లిపి డాట్‌ గేమ్‌" అన్న దాన్ని రూపొందించి.. అంతర్జాలంలో వాడకం కోసం ట్రయల్స్‌ పూర్తి చేశారు. ఇటీవలే విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా దీనిని ఆవిష్కరించారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలైన మొబైల్‌, టాబ్‌, లాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ వంటి వాటిపై ఆడుకునేందుకు వీలుగా దీనిని రూపొందించినట్లు.. సాగర్‌ వివరించారు. దీనిని ఆడటం వల్ల మనోఉల్లాసంతో పాటు భాషపై పట్టు, జ్ఞాపకశక్తి పెరుగుతాయని చెప్పారు.

"దీనిని ఆడటం ద్వారా పిల్లలకే కాదు పెద్దలకు కూడా మనోవిల్లాసంతో పాటు భాష మీద పట్టు పెరుగుతుంది. ప్రతిరోజూ 15నిమిషాలు ఆడటం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మాతృభాషలో ఆడటం ద్వారా బ్రెయిన్​కి ఎక్సర్​సైజ్​ అవుతుంది. లిపి గేమ్​లో ప్రతిరోజూ ఓ తెలుగు పదం గోప్యంగా ఉంటుంది. ఏడు క్లూస్​లతో ఆ పదాన్ని వెతకాలి. అది కరెక్టా లేదా అనేది డిక్షనరీలోకి వెళ్లి వెతకాలి. కాలిఫోర్నియాలో యూనివర్సిటీ ఆఫ్​ సిలికాన్​ ఆంధ్ర ద్వారా కోటి మాటల కోట అని ఒక ప్రాజెక్టు చేశాం. ప్రపంచంలో ఇప్పటిదాకా ఉన్నా పాత, కొత్త తెలుగు పదాలు అన్ని అందులో ఉంటాయి"-సాగర్‌ అనిసింగరాజు, లిపి డాట్​ గేమ్​ రూపకర్త

తెలుగు భాష పరిరక్షణకు "లిపి డాట్​ గేమ్​".. ఆవిష్కరించిన విశాఖ వాసి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.