ETV Bharat / state

ruling party leaders land grabs : విశాఖలో భూకబ్జా.. సర్దేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు

author img

By

Published : May 30, 2023, 11:53 AM IST

ruling party leaders land grabs : విశాఖలో అధికార పార్టీ నేతల భూదందా కొనసాగుతోంది. విశాఖను రాజధానిగా మారుస్తామని, తన నివాసాన్ని విశాఖకు మారుస్తానని సీఎం జగన్ ప్రకటించిన నేపథ్యంలో భూ అక్రమాలు పెరిగాయి. అందిన కాడికి సర్దుకోవాలని అక్రమార్కులు భావిస్తున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.

Etv Bharat
Etv Bharat

ruling party leaders land grabs : విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడం, అటు పై ముఖ్యమంత్రి జగన్ సైతం సెప్టెంబర్ నుంచి ఇక్కడే మకాం ఉంటాను అని చెప్పిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ ముఖ్య నేతల బంధువుల కన్ను విశాఖ పరిసర భూములు పై పడింది. సీఎం మకాం వచ్చే లోపు అందిన కాడికి సర్దేయాలని ప్రభుత్వ భూములు, కోర్ట్ ఆదేశాలున్న భూములు, ప్రభుత్వం రిజిస్ట్రేషన్ రద్దు చేసిన భూములని కూడా చూడకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆ కోవకు చెందిన తతంగమే విశాఖ కూర్మన్న పాలెంలో జరిగింది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ అనుమతి రద్దు చేసిన స్థలాన్ని సైతం అడ్డదారిలో ఆక్రమించు కుంటున్న వైనం బయట పండింది.

కూర్మన్న పాలంలో ప్రభుత్వ భూమి సర్వ్ నంబర్ 23/1గా రెవెన్యూ రికార్డు లో ఉంది. ఈ ప్రభుత్వ భూమి 5.38 ఎకరాలు ఉంటే వాస్తవానికి రేబాక అప్పన్న కు 1.06 ఎకరాల భూమి డి పట్టా గా ఇచ్చారు. రేబాక అప్పన్న నుంచి ఒక ఐదేళ్ల తరవాత కుమార్తె కొనుగోలు ( document number 255/60)చేశారు . ప్రభుత్వం ఇచ్చిన భూమి పై క్రయ విక్రయాలు చేయకూడదని అధికారులు దృష్టికి తీసుకుని వెళ్తే ఇప్పటికి రెండు సార్లు ఈ స్థలంపై కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయినప్పటికీ రేబాక అప్పన్న కుమార్తె ప్లాట్లుగా అమ్ముకోవడానికి సన్నద్ధమై కొందరికి అమ్మే ఆలోచన చేశారు. ఐతే ప్రభుత్వం ఇచ్చిన భూమి ని సొంత ప్రయోజనాలకు వాడకూడదని ఆదేశాలు ఇచ్చారు. ఈ భూమిలో ఒక బిల్డర్ అపార్ట్ మెంట్ నిర్మాణం చేపట్టే యోచన చేస్తే ఆ నిర్మాణాన్ని అడ్డుకోవడం, విద్యుత్ సరఫరా కు అనుమతి నిలిపి వేశారు. రద్దు చేసిన ప్రభుత్వ భూమిలో ౦.5గజాలు గా ప్లాట్లుగా వేసి అమ్మే ప్రయత్నం చేశారు. వీటిని కూడా జీవీఎంసీ అధికారులు అడ్డుకున్నారు. ఈ వ్యవహారం న్యాయ స్థానంలో నడుస్తోంది.

Amul Dairy: మొన్న కర్నాటక.. నేడు తమిళనాడు.. అయినా మారని ఏపీ తీరు.. రెడ్​ కార్పెట్​ వేసి మరీ సహకారం..!

కోర్టులో వివాదం కొనసాగుతున్నా లెక్క చేయకుండా మరో బిల్డర్ కి డెవలప్మెంట్ కి ఇచ్చినట్టు డాక్యుమెంట్స్ సృష్టించారు. ఈ సర్వే నంబర్ లో 2008లో ఇదే స్థలాన్ని 29 గజాలు డాక్యుమెంట్ నెంబర్ ( 5638/2004) తో ప్లాట్ గా విభజించారు. తీగ లాగితే డొంక కదిలింది ఈ భూమి చదును చేస్తున్న కుటుంబానికి ఉత్తరాంధ్ర లో సీనియర్ మంత్రులతో నేరుగా జోక్యం చేసుకున్నారని బాధితులు చెప్తున్నారు. అందుకే కూర్మన్న పాలెం లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ భూమి పై తమకు హక్కు ఉందని 2004 లోనే 1791/59డాక్యుమెంట్ తో కూర్మన్న పాలెం పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. స్థల హక్కులు మీద కోర్ట్ లో వివాదం నడుస్తూ ఉన్న మెహర్ రమేష్ అనే యువకుడు జేసీబీలతో చదును చేస్తున్నాడు. ఐనా సరే గాజువాక అధికారులు కనీసం అటు వైపు చూడటం లేదు.

Amul Dairy: మొన్న కర్నాటక.. నేడు తమిళనాడు.. అయినా మారని ఏపీ తీరు.. రెడ్​ కార్పెట్​ వేసి మరీ సహకారం..!

ఉత్తరాంధ్ర లో కీలక మంత్రి కుటుంబ సభ్యులు ఈ మొత్తం వ్యవహారంలో ఉండటం తో అధికారులు లోపాయికారిగా మాట్లాడుతున్నారు. నగర నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడం పై ప్రజానీకం ఆగ్రహిస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్స్ నిలుపు చేసినా దొడ్డి దారిలో కొందరు వైఎస్సార్సీపీ నేతల బంధువులు ప్రభుత్వ భూమిని హస్త గతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం విశాఖ నుంచి నివాసం ఏర్పాటు చేసుకునే లోపే భూములను పెంచుకొవాలనే ఉద్దేశ్యంతో వైఎస్సార్సీపీ నేతల ఆశీస్సులతో కోర్ట్ లో ఉన్నా వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే రెండు సార్లు రిజిస్ట్రేషన్ అనుమతి నిలుపు చేసినా అన్యాక్రాంతం చేస్తున్నారు. ఈ ప్రభుత్వ భూమిని రెవిన్యూ అధికారులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే ఇరు వర్గాలు పొలీసులను ఆశ్రయించారు.

IPL 2023 : చివరి బంతి వరకు ఉత్కంఠ.. అనూహ్య ఫలితం.. ఈ సీజన్​లో ఫుల్​ కిక్ ఇచ్చిన మ్యాచ్​లు ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.