వాటిని కొనసాగించడం అక్రమమే కదా..? రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు కన్నెర్ర

author img

By

Published : Jan 20, 2023, 5:10 PM IST

Updated : Jan 21, 2023, 9:38 AM IST

AP hight court

High Court angry over the construction in schools: పాఠశాలల ఆవరణల్లో గ్రామ సచివాలయాల భవనాలు నిర్మించటంపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి కన్నెర్ర చేసింది. నిర్మాణాలు నిలపాలని చెప్పినా.. వాటిని కొనసాగించడం అక్రమమే కదా? అని ప్రశ్నించింది.

High Court angry over the construction in schools: రాష్ట్ర ప్రభుత్వం గతంలో పాఠశాలల ఆవరణలో గ్రామ సచివాలయాల నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నేడు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా "ప్రజా సొమ్ముతో నిర్మించినందుకు భవనాలను సంబంధిత పాఠశాలలకే అప్పగిస్తున్నాం.. పాఠశాలల అవసరాలకే వినియోగించేలా చూస్తున్నాం" అని ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలలో పేర్కొంది. ఈ విషయమై ధర్మాసనం స్పందిస్తూ.. "నిర్మాణాలు నిలపాలని చెప్పినా.. కొనసాగించడం అక్రమమే కదా? మరి ప్రజావేదిక కూడా ప్రజా సొమ్ముతోనే కట్టారు కదా? అప్పుడొక వైఖరి, ఇప్పుడొక వైఖరి అయితే ఎలా?" అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అనంతరం విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది.

పాఠశాలల ఆవరణల్లో గ్రామ సచివాలయాలు గానీ, రైతు భరోసా కేంద్రాలు గానీ, ఇతర ఏ భవనాలను నిర్మించకూడదని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినా.. వాటి నిర్మాణాలు ఆగకపోవడంతో మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎస్‌ స్వయంగా హాజరుకావాలని ఇటీవలే న్యాయస్థానం ఆదేశించింది. అయినా కూడా సచివాలయాల భవనాలను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో పలుమార్లు ఉన్నతాధికారులు హైకోర్టు ఎదుట హాజరయ్యారు. పదే పదే హైకోర్టు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నందున మరోసారి హైకోర్టు కన్నెర్ర చేసింది. తదుపరి విచారణనను ఈనెల 24కి వాయిదా వేసింది.

ఇవీ చదవండి

Last Updated :Jan 21, 2023, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.