ETV Bharat / state

త్వరలోనే రైల్వే జోన్ ప్రక్రియ: జీవీఎల్

author img

By

Published : Nov 13, 2022, 10:11 PM IST

MP GVL Narasimha Rao: ప్రధాని విశాఖ పర్యటనకు ఒకరోజు ముందే రైల్వేజోన్ నిర్థారిస్తూ నోటిఫికేషన్ విడుదలైందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు తెలిపారు. రాయగడ జోన్, సౌత్ కోస్ట్ జోన్లకు 106 కోట్లు మంజూరు చేశారన్నారు. రైల్వే మంత్రి జోన్ ప్రధాన‌కార్యాలయం ఎక్కడ నిర్మించాలో మంత్రి తనిఖీ కూడా చేశారన్నారు. నిర్మాణ ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందని జీవీఎల్ తెలిపారు.

జీవీఎల్ నరసింహరావు
GVL Narasimha Rao

BJP MP GVL Narasimha Rao: ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన విజయవంతం అయిందని.. వ్యక్తిగతంగా నా అభ్యర్థన మేరకే విశాఖలో సభ జరిగిందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. అనేక ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలు జరగటం రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇస్తున్న సహకారానికి నిదర్శనమని జీవీఎల్ పేర్కొన్నారు. ప్రధాని విశాఖ పర్యటనకు ఒకరోజు ముందే రైల్వేజోన్ నిర్థారిస్తూ నోటిఫికేషన్ విడుదలైందని తెలిపారు. రాయగడ జోన్, సౌత్ కోస్ట్ జోన్లకు రూ.106 కోట్లు మంజూరు చేశారన్నారు. రైల్వే మంత్రి జోన్ ప్రధాన‌ కార్యాలయం ఎక్కడ నిర్మించాలో.. మంత్రి తనిఖీ కూడా చేశారన్నారు. నిర్మాణ ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందని జీవీఎల్ తెలిపారు. నేషనల్ ఇంటర్నెట్ ఎక్సేంజ్ ఆఫ్ ఇండియా ఎనిమిది సెంటర్లలో ఒకటి విశాఖకు దక్కిందని తెలిపారు.

జీవీఎల్ నరసింహారావు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.