ETV Bharat / state

స్టేషన్లలో గంజాయి కుప్పలు... తల పట్టుకుంటున్న అధికారులు

author img

By

Published : Dec 18, 2019, 8:52 PM IST

ganja vehicle stocks at visakha
విశాఖలో గంజాయి వాహనాలు

విశాఖపట్నం జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు ఎప్పటికప్పుడు సాధ్యమైనంతగా అడ్డుకుంటూనే ఉన్నారు. పట్టుబడిన గంజాయిని స్టేషన్లకు తరలిస్తున్నారు. అలా పేరుకుపోతున్న నిల్వలను ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. పట్టుబడిన వాహనాలూ తుప్పు పట్టి పనికిరాకుండా పోతున్నాయి.

స్టేషన్‌లో గంజాయి కుప్పలు- పోలీసులకు తిప్పలు

విశాఖపట్నం జిల్లాలో రోజూ ఏదో మూలన గంజాయి వాహనాలు పట్టుకోవడం... నిరంతర ప్రక్రియగా మారింది. ఇలాంటి కేసులు ఎక్కువ మన్యంలోనే నమోదవుతున్నా.. పరిష్కార మార్గం మాత్రం కనుక్కోలేకపోతున్నారు. ఇలా రోజూ నమోదయ్యే గంజాయి కేసుల్లో పట్టుబడిన సరుకు పోలీసు స్టేషన్ల పరిసరాల్లో నిండిపోతోంది. చిక్కిన వాహనాలు వేలానికి నోచుకోక తుప్పుపట్టిపోతున్నాయి.

చాప కింద నీరులా గంజాయి

విశాఖ గ్రామీణ జిల్లాలో నర్సీపట్నం, అనకాపల్లి, యలమంచిలి, చోడవర , మాడుగుల, పాయకరావుపేట ప్రాంతాల్లో ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడి సిబ్బంది.. మద్యం వ్యాపార పర్యవేక్షణతోపాటు.. గంజాయి రవాణాను అరికట్టాలి. కానీ.. గంజాయి నిర్మూలనే వీరికి ప్రధాన పనిగా మారిపోయింది. ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో ఈ సాగు విస్తృతి ఎక్కువ. అక్కడి నుంచి ఏదో రూపంలో మైదాన ప్రాంతానికి చేర్చుతోందీ గంజాయి.

అటు గంజాయి కుప్ప- ఇటు వాహనానికి తుప్పు

జిల్లావ్యాప్తంగా ఇటీవలి కాలంలో సుమారు 70వేల కిలోల గంజాయిని పట్టుకున్నట్టు అధికారుల అంచనా. సుమారు 700కుపైగా వాహనాలు చిక్కాయి. హైకోర్టు ఆదేశాలు మేరకు గంజాయిని తగులబెట్టాలి... వాహనాలు వేలం వేయాలి. పాలనాపరమైన సమస్యలతో వాహనాలు తుప్పుపట్టిపోతున్నాయి. గంజాయి గుట్టలు పేరుకుపోయాయి. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా కుప్పలు తగ్గడం లేదంటున్నారు అధికారులు.

అవగాహన కల్పించాలి...

గంజాయి సాగు అరికట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలతో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

ఇదీ చూడండి

ఏ రైళ్లో ఏ అందముందో...?

Intro:యాంకర్ : గంజాయి . . . ఈ పెరు విశాఖపట్నం జిల్లాలో సర్వసాధారణం అయిపోయింది. రోజు ఏదో మూలన గంజాయి పట్టువడటం , నిందితులను , వాహనాలను పట్టుకోవడం జిల్లాలో నిరంతర ప్రక్రియ అయిపోయింది. ఈ క్రమంలో నే విశాఖ మన్యం మొదలుకొని మైదాన పట్టణ ప్రాంతాల్లో సాగు , వినియోగం మాములే. గంజాయి కేసులు నమోదు అవుతున్నంత తొందరగా ఇవి పరిస్కారం కావటం లేదు. ఈ కారణంగా స్టేషన్ ప్రాంగణాలు , లాకప్ గదులు గోదాములుగా మారుతున్నాయి. స్టేషన్ కార్య కళాపాలకు ఇబ్బంది కలుగుతుంది. మొరోపక్క పట్టుబడిన వాహనాలు తుప్పు పట్టి పాడిపోతున్నాయి. వాయిస్ ఓవర్ : విశాఖ గ్రామీణ జిల్లాలో నర్సీపట్నం , అనకాపల్లి , యలమంచిలి , చోడవరం ,మాడుగుల , పాయకరావుపేట ప్రాంతాల్లో ఏక్సిస్ స్టేషన్లు ఉన్నాయ్. సాధారణంగా వీరికి మద్యం వ్యాపారాన్ని పర్యవేక్షణ తోపాటు ఇ లాంటి కేసులను నమోదు చేస్తుందాలి.అయితే ఇటీవల కాలంలో వీరికి గంజాయి అక్రమ రవాణా వ్యవస్థ ను నిర్ములానే పెద్ద కసరత్తు అయింది. విశాఖ మన్యం లోని ఆంద్రా ఒడిశా సరిహద్దుల్లో గంజాయి ని సాగుతోంది. అక్కడ పంట కాలం పూర్తి అయిన తరువాత అక్కడినుంచి ఏదో రూపంలో మైదాన ప్రాంతానికి చేర్చడానికి ద్విచక్రవాహనం మొదలుకుని పెద్ద ,పెద్ద వేగన్లు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 70వేల కిలోల గంజాయి ని పట్టుకున్నట్టు అంచనా. అదే క్రమంలో 700కు పైగా వాహనాలు పట్టుబడ్డాయి. వీటిని హైకోర్టు ఆదేశాలు మేరకు గంజాయిని తగుల బెట్టడంతో పాటు వాహనాలు వేలం వేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ కు పరిపాలన పరమైన ఇబ్బందులు కలుగుతుందండతో వాహనాలు తుప్పు పట్టి పాడిపోతున్నాయి. గంజాయి నిల్వలు పేరుకు పోతున్నాయి. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. బైట్ : ఎం భాస్కరరావు , అసిస్టెంట్ కమీషనర్, విశాఖ. OVER.


Body:NARSIPATNAM


Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.