ETV Bharat / state

ఆవకాయ పచ్చడి తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు

author img

By

Published : Jul 11, 2019, 3:17 PM IST

గుంటూరు జిల్లాలోని రామకృష్ణ మిషన్ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అక్షయపాత్ర సరఫరా చేసిన మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత కడుపులో నొప్పి రావడంతో దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు

మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రామకృష్ణ మిషన్ పాఠశాలలో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అక్షయపాత్ర సరఫరా చేసిన మధ్యాహ్న భోజనంలో మామిడికాయ పచ్చడి తిని విద్యార్థులు ఆనారోగ్యం పాలయ్యారు. బుధవారం మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత కడుపులో నొప్పి రావడంతో దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించగా...మళ్లీ గురువారం ఉదయం విద్యార్థులకు కడుపులో నొప్పితో పాటు వాంతులు చేసుకోవటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
అక్షయపాత్ర అధికారులు మాత్రం రోజుకు 15వేల మంది విద్యార్థులకు ఆహారం అందిస్తామని...ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని తెలిపారు. ఒక్క రామకృష్ణ మిషన్ పాఠశాల విద్యార్థులకు ఇలా ఎందుకైందో తెలియడం లేదన్నారు. పచ్చడి బాగుందని ఎక్కువ మోతాదులో తినడంతో అస్వస్థతకు లోనయ్యారని వైద్యురాలు రమాదేవి తెలిపారు.

ఇది చూడండి:'డియర్​' కోసం తపన... కామ్రేడ్​ ట్రైలర్​

Intro:పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఎంపీడీవో బాలాజీ ఇంచార్జ్ తహసిల్దార్ సత్యనారాయణ ఎం ఈ ఓ శ్రీనివాసరావు ఈ ఓ పి ఆర్ డి కొండల్ రావు ముఖాముఖి జరిపారు మండలంలోని అంకంపాలెం రాజవరం స్వర్ణ వారి గూడెం పంచాయతీలు చెందిన 26 మంది గిరిజన అభ్యర్థులు ముఖాముఖి లో పాల్గొని వివరాలు సమర్పించారు నిష్పక్షపాతంగా ముఖాముఖి నిర్వహించి వాలంటీర్లు ఎంపిక జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు


Body:పోలవరం ప్రసాద్


Conclusion:పోలవరం ప్రసాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.