ETV Bharat / state

operation parivartana: "270 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం"

author img

By

Published : Nov 3, 2021, 1:26 PM IST

'ఆపరేషన్ పరివర్తన' పేరుతో గంజాయి సాగుపై పోలీస్​ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది(dgp office on operation parivartana). గత మూడు రోజులుగా సాగుతున్న ఈ ఆపరేషన్​లో భాగంగా.. విశాఖ ఏజెన్సీలోని 270 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసినట్లు డీజీపీ కార్యాలయం వెల్లడించింది.

gdp on operation parivartana
విశాఖ ఏజెన్సీలో ఆపరేషన్ పరివర్తన

'ఆపరేషన్ పరివర్తన' పేరుతో గంజాయిపై రాష్ట్ర పోలీస్​ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది(dgp office on operation parivartana). ఇందులో భాగంగా విశాఖ ఏజెన్సీలో ఆపరేషన్ పరివర్తన(operation parivartana for control ganja cultivation) చేపట్టారు. మూడు రోజులుగా కొనసాగిస్తున్న ఈ ఆపరేషన్​లో జి.మాడుగుల, జి.కె.వీధి మండలాల్లోని 270 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసినట్లు డీజీపీ కార్యాలయం వెల్లడించింది.

మొత్తం 390-400 ఎకరాల్లో హై గ్రేడ్ గంజాయి సాగు గుర్తించామని.. ఐటీడీఏ, రెవెన్యూ, అటవీ, ఎస్‌ఈబీ బృందాలు సమన్వయంతో పనిచేస్తూ.. ఈ సాగుపై ఉక్కుపాదం మోపినట్లు డీజీపీ ఆఫీస్ తెలిపింది. 800 మంది సిబ్బందితో 10 బృందాలుగా ఆపరేషన్ పరివర్తన చేపట్టామని.. ఒడిశా సరిహద్దులోనూ గంజాయి ధ్వంసం ప్రారంభిస్తుందని పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.