ETV Bharat / state

నూరు శాతం సామర్ధ్యంతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నడిపించాలి..: సీహెచ్ నర్సింగరావు

author img

By

Published : Apr 11, 2023, 10:30 PM IST

Updated : Apr 11, 2023, 10:39 PM IST

Visakha Steel Plant Privatization Issue: దేశంలో అన్ని స్టీల్‌ప్లాంట్‌లకు సొంత గనులు ఉన్నా కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు ఎందుకు కేటాయించదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ముడి సరుకు, మూలధనం సమకూర్చి, నూరు శాతం సామర్ధ్యంతో నడిపించాలని, లేకపోతే విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తమ పోరాటాలను ఉద్ధృతం చేస్తుందని ఆయన హెచ్చరించారు.

Visakha Steel Plant Privatization Issue
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య

నూరు శాతం సామర్ధ్యంతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నడిపించాలి..లేకపోతే పోరాటాలే: సీహెచ్ నర్సింగరావు

Visakha Steel Plant Issue : ఏ భారీ పరిశ్రమనైనా కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌ చేస్తానంటే ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఆ పరిశ్రమను కొనాలని, సింగరేణిని బీజేపీ ప్రైవేట్‌ చేస్తానంటే తెలంగాణ ప్రభుత్వమే సింగరేణిని కొంటామని ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు అన్నారు. విశాఖ సీఐటీయూ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వాలే కొన్నాయి : విశాఖ స్టీల్‌ను కూడా తెలంగాణ ప్రభుత్వమే కొంటామని ప్రకటించడం సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు ఆయన అన్నారు. కేరళలో హిందూస్థాన్‌ ప్రింటర్స్‌తో సహా రాష్ట్రంలోని ఏ కేంద్ర ప్రభుత్వ పరిశ్రమైన అమ్ముతామని ప్రకటిస్తే కేరళ రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని నిర్ణయించిందని, హిందూస్థాన్‌ ప్రింటర్స్‌ని కొని కేరళ రాష్ట్ర పభుత్వమే లాభాలతో నడిపిస్తోందని అన్నారు. తమిళనాడులోని సేలం స్టీల్‌ప్లాంట్‌, నైవేలీ లిగ్నైట్‌లను అమ్మాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, తమిళ నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ పరిశ్రమలను తామే కొంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారని, ఫలితంగా కేంద్ర ప్రభుత్వం సేలం స్టీల్‌, నైవెలీ లిగ్నైట్‌ల అమ్మకాలు ఆగిపోయాయని ఆయన చెప్పారు.

మౌనంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రభుత్వం : కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీతో లాలూచిపడి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కొంటామని నేటికి ప్రకటించలేదని, బీజేపీని ఎదిరించే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ప్రజలు, కార్మికులు భావిస్తున్నారని అన్నారు. గత రెండేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్ముతామని పదే పదే ప్రకటిస్తున్నదని, 22 మంది ఎంపీలు ఉన్నా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రభుత్వం మౌనం దాల్చడంతో ఆయన ఆవేదన చెందారు. గత ఏడాది నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పూర్తి సామర్ధ్యంతో నడపకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని అన్నారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్​ను ఎందుకు అమ్ముతున్నారు? : దేశంలో అన్ని స్టీల్‌ప్లాంట్‌లకు లాభాలు వచ్చినా విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సుమారు 3వేల కోట్లు నష్టాలు మూట కట్టిందని సీచ్ నరసింగరావు బాధ పడ్డారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నూరు శాతం సామర్ధ్యంతో నడపాలని స్టీల్‌ పోరాట కమిటీ ఒత్తిడి చేస్తున్నదని, ఫలితంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ముడి ఖనిజం, మూలధనం సమకూర్చడానికి ఆసక్తి కలిగిన వారి కోసం యాజమాన్యం గత నెల నోటిఫికేషన్‌ జారీ చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మాలనే ప్రయత్నాలను మా పోరాట కమిటీ అడుగడునా అడ్డుకుంటున్నదని, బంగారు బాతు లాంటి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఎందుకు అమ్ముతారో కేంద్ర బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. దేశంలో సముద్ర తీరంలో ఉన్న ఏకైక స్టీల్​ ప్లాంట్​ విశాఖ స్టీల్​ ప్లాంట్​ అని అన్నారు.విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు సమకూర్చాలని విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ముడి సరుకు, మూలధనం సమకూర్చి నూరు శాతం సామర్ధ్యంతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నడిపించాలని డిమాండ్​ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత : కేంద్ర ప్రభుత్వం దేశంలో అన్ని స్టీల్‌ప్లాంట్‌లకు సొంత గనులు ఉన్నా విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు ఎందుకు కేటాయించదు? కేంద్ర ప్రభుత్వ కుట్రలను, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిలదీయలేకపోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఇటువంటి అద్వాన్న పరిస్థితి దాపురించిందని అన్నారు. 32మంది ప్రాణాల బలిదానంతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సాధించుకున్నామని, 16వేల మంది రైతులు 22వేల ఎకరాల భూముల త్యాగాల ఫలితంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వచ్చింది సీఐటీయు రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు.

ఇవీ చదవండి

Last Updated : Apr 11, 2023, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.