ETV Bharat / state

పరవాడ ఫార్మాసిటీలోని బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి:చంద్రబాబు

author img

By

Published : Dec 27, 2022, 3:12 PM IST

CBN On Paravada Reacted Industry Accident: పరవాడ ఫార్మాసిటీలోని లారెస్ ల్యాబ్ ప్రమాదంలో నలుగురు మృతి చెందిన వార్త కలచివేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. పరిశ్రమల్లో భద్రత విషయంలో ప్రభుత్వ ఏజెన్సీలు నిత్యం తనిఖీలు చేయకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతుందని విమర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు
cbn

CBN On Paravada Reacted Industry Accident: పరవాడ ఫార్మాసిటీలోని లారెస్ ల్యాబ్ ప్రమాదంలో నలుగురు మృతి చెందిన వార్త కలచివేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. మృతులందరూ 35 ఏళ్ల లోపు వారు కావడం మరీ విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తీవ్రగాయాల పాలైన మరో వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. పరిశ్రమల్లో భద్రత విషయంలో ప్రభుత్వ ఏజెన్సీలు నిత్యం తనిఖీలు చేయకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతుందని విమర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.