ETV Bharat / state

Somu Veerraju: అవసరమైతే ఒంటరిగానైనా పోటీ: సోము వీర్రాజు

author img

By

Published : Apr 4, 2022, 7:17 AM IST

Somu veerraju: జనసేన పార్టీతో ఇప్పటికే తమకు పొత్తుందని, ప్రస్తుతానికి ఇంకెవరితోనూ కలిసి పని చేయాల్సిన అవసరం లేదని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. అవసరమైతే ఒంటరిగానైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

BJP leader somu veerraju fires on YSRCP
అవసరమైతే ఒంటరిగానైనా పోటీ: భాజపా

Somu veerraju: జనసేన పార్టీతో ఇప్పటికే తమకు పొత్తుందని.. ప్రస్తుతానికి ఇంకెవరితోనూ కలిసి పని చేయాల్సిన అవసరం లేదని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. అవసరమైతే ఒంటరిగానైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. విశాఖ జిల్లా పాడేరులో ఆదివారం ఆయన పర్యటించి.. పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. సంక్షేమ పథకాల అమలుకు కేంద్రం దండిగా నిధులిస్తుంటే.. పథకాలన్నీ తమవిగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇటీవల ప్రారంభించిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు సహా ప్రతి పథకం అమలుకూ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని తెలిపారు.

ఇదీ చదవండి:

ఆకాశన్నంటుతున్న ధరలు.. ఏం కొనేట్టు లేదు.. ఏం తినేట్టు లేదు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.