ETV Bharat / state

'విద్యార్థినిపై నా భర్త లైంగిక దాడి చేశాడు'

author img

By

Published : Feb 11, 2020, 3:04 PM IST

తన భర్త ఓ విద్యార్థినితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడంటూ ఓ ప్రొఫెసర్ భార్య పోలీసులను ఆశ్రయించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పని చేస్తున్న తన భర్తపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

au professor wife complaint against husband
భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్​ రమేశ్​బాబు భార్య పోలీసులను ఆశ్రయించింది. తన భర్త ఓ విద్యార్థినిని లోబరుచుకొని, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపించింది. తన భర్తపై చర్యలు తీసుకోవాలని విశాఖ 3వ పట్టణ పోలీస్ స్టేషన్​లో ఆమె ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థినిని విచారించారు. అయితే విద్యార్థిని ఎటువంటి విషయం చెప్పకపోవటంతో కౌన్సిలింగ్ నిర్వహించి.. వివరాలు తరువాత సేకరిస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు.

భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

ఇదీ చదవండి: 'నా బిడ్డను గొయ్యి తీసి పూడ్చిపెట్టాను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.