ETV Bharat / state

పిల్లలపై వైరస్ ప్రభావంపై సరైన అధ్యయనం లేదు.. కానీ..: రణదీప్ గులేరియా

author img

By

Published : Aug 14, 2021, 5:34 PM IST

Updated : Aug 14, 2021, 7:55 PM IST

దేశంలో కొవిడ్‌ ప్రవర్తనా నియమావళిని పాటించడంపైనే మూడో వేవ్‌ ఆధారపడి ఉంటుందని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా అన్నారు. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం 41వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనేందుకు గులేరియా విశాఖ వచ్చారు.

రణదీప్ గులేరియా
రణదీప్ గులేరియా

పిల్లలపై వైరస్ ప్రభావాన్ని వివరిస్తున్న రణదీప్​ గులేరియా

దేశంలో కొవిడ్‌ ప్రవర్తనా నియమావళిని పాటించడంపైనే మూడో వేవ్‌ ఆధారపడి ఉంటుందని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా అన్నారు. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం 41వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనేందుకు గులేరియా విశాఖ వచ్చారు. ఆయనకు గీతం విద్యా సంస్థల ఛైర్మన్‌ శ్రీభరత్‌.. గీతం ఫౌండేషన్‌ డే అవార్డును అందించారు. ఈ సందర్భంగా.. కొవిడ్‌ కేసులపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

పిల్లలపై తీవ్రంగా ప్రభావం ఉంటుందన్న దానికి సరైన అధ్యయనం లేదని, కేవలం వాళ్లకు వ్యాక్సినేషన్‌ కాలేదు కాబట్టి ఎక్కువగా వైరస్‌ బారిన పడేవాళ్లలో అధికంగా ఉంటారని మాత్రమే అంచనా వేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయని, కొవిడ్‌ ప్రవర్తనా నియమావళిని ఏ మేరకు పాటిస్తున్నామనే అంశంపైనే వైరస్‌ వ్యాప్తి ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో కేసుల కట్టడి ఇప్పుడు బాగుందని చెప్పిన ఆయన, హఠాత్తుగా ఒక ప్రాంతంలో కేసుల విజృంభణ జరిగితే వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే ఇతర ప్రాంతాల్లో వైరస్ వ్యాపించకుండా ఉంటుందన్నారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్లు బాగానే పనిచేస్తున్నాయని, వైరస్‌ సైతం వేరు విధాలుగా రూపాంతరం చెందుతూ వ్యాక్సిన్‌ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే ఉందన్నారు. హెర్డ్‌ ఇమ్యూనిటీ వైరస్‌ తీరుపై ఆధారపడి ఉంటుందని, వ్యాక్సిన్‌ నుంచి వైరస్‌ తప్పించుకోగలిగితే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యం కాదని వివరించారు.

ఇదీ చదవండి:

నెల్లూరు జిల్లాలో విషాదం.. ప్రియుడి మృతి తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య

Last Updated : Aug 14, 2021, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.